ఈ శాంసంగ్ ఫోన్ ధర మళ్లీ పెరిగింది.. అయినా రూ.8 వేలలోపే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన బడ్జెట్ ఫోన్ గెలాక్సీ ఎం02 ధరను మనదేశంలో పెంచింది. దీంతో ఇప్పుడు ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.7,999 నుంచి ప్రారంభం కానుంది.

ప్రధానాంశాలు:శాంసంగ్ గెలాక్సీ ఎం02 ధర పెరిగిందిరూ.7,999 నుంచి ప్రారంభంశాంసంగ్ గెలాక్సీ ఎం02 స్మార్ట్ ఫోన్ ధర మనదేశంలో మరోసారి పెరిగింది. గతవారం శాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్, గెలాక్సీ ఎం02ఎస్, గెలాక్సీ ఏ12 స్మార్ట్ ఫోన్ల ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోన్ ధర కూడా పెరిగింది. ఈ ఫోన్ ఇప్పుడు పెరిగిన ధరతోనే అందుబాటులో ఉంది. అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్ సైట్లో ఇది కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎం02 ధర
ఇందులో 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ సాధారణ ధర రూ.6,999 కాగా, తర్వాత దాన్ని రూ.7,499కు పెంచారు. ఇప్పుడు మరో రూ.500 పెంపుతో రూ.7,999కి దీన్ని కొనుగోలు చేయవచ్చు.

3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా ఇందులో ఉంది. దీని ధరను గతంలో రూ.7,499 నుంచి రూ.7,999కు పెంచారు. ఇప్పుడు మరో రూ.500 పెంపుతో ఇది రూ.8,499కు చేరింది. బ్లాక్, బ్లూ, గ్రే, రెడ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, శాంసంగ్ ఆన్ లైన్ స్టోర్, ప్రముఖ ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
7000 ఎంఏహెచ్ బ్యాటరీతో కొత్త ఫోన్.. ధర రూ.12 వేలలోపే!
శాంసంగ్ గెలాక్సీ ఎం02 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్‌యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ ఎంటీ 6739 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 3 జీబీ వరకు ర్యామ్‌ను ఇందులో అందించారు. 32 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఇందులో ఉంది. ఇక ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, దీంతోపాటు 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎం02 మందం 0.91 సెంటీమీటర్లు కాగా, బరువు 206 గ్రాములుగా ఉంది.
మోటో జీ60ఎస్ ధర, ఫీచర్లు లీక్.. ఏకంగా 108 మెగాపిక్సెల్ కెమెరా!
Samsung Galaxy M02 స్పెసిఫికేషన్లుపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిపెర్ఫార్మెన్స్MediaTek MT6739స్టోరేజ్_ఫైల్32 GBబ్యాటరీ5000 mAhprice_in_india6799డిస్_ప్లే6.5 inches (16.55 cm)ర్యామ్2 GBపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిఇతర వేరియంట్లు Samsung Galaxy M02 Samsung Galaxy M02 32GB 3GB RAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అలా గర్భం దాల్చిన మహేశ్ హీరోయిన్.. అసలు కారణం తెలిస్తే..

Tue Jul 13 , 2021
కొందరు హీరోయిన్లకు ఒక సినిమాతో బ్రేక్ వస్తుంది.. కొందరికి బ్రేక్ రావాలంటే ఎన్నో సినిమాలు చేయాల్సి వస్తుంది. అలా ఎన్నో సినిమాలు చేసినా సరైనా బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న బ్యూటీ కృతి సనన్. తాజాగా ఆమె ‘మిమీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.