ఎప్పుడైనా ఇలా జరుగుతుందని ఊహించావా?.. సమంత కామెంట్స్ వైరల్

సమంత ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. ఇక సోషల్ మీడియా, మీడియాలో అయితే సమంత వార్తలే కనిపిస్తున్నాయి. అంతా ఆమె గురించే చర్చలు జరుగుతున్నాయి. సమంత, నాగ చైతన్య విడాకుల వ్యవహారం గురించి జాతీయ మీడియాలోనూ చర్చకు దారి తీస్తోంది.

ప్రధానాంశాలు:అట్టహాసంగా సైమా వేడుకలుఓ బేబీకి అవార్డుల పంటఉత్తమ నటిగా సమంతసమంత ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. ఇక సోషల్ మీడియా, మీడియాలో అయితే సమంత వార్తలే కనిపిస్తున్నాయి. అంతా ఆమె గురించే చర్చలు జరుగుతున్నాయి. సమంత, నాగ చైతన్య విడాకుల వ్యవహారం గురించి జాతీయ మీడియాలోనూ చర్చకు దారి తీస్తోంది. ఎవ్వరూ ఏమీ మాట్లాడకపోవడం, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత కూడా రూమర్లను కొట్టిపారేయకపోవడంతో అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి. అయితే సమంత మాత్రం సోషల్ మీడియాలో గంటకో పోస్ట్ పెడుతోంది. ఇన్ స్టాగ్రాంను తన స్టోరీలతో నింపేస్తోంది.

కానీ విడాకుల విషయం మీద మాత్రం స్పందించడం లేదు. సమంత ఇప్పుడు ఓ బేబీ సినిమా హ్యాంగోవర్‌లో ఉంది. ఓ బేబీ సినిమాకు గానూ సమంతకు ఉత్తమ నటిగా అవార్డు లభించింది. కానీ సమంత సైమా వేడుకలకు హాజరు కాలేదు. సమంత ప్రస్తుతం చెన్నైలో ఉందన్న సంగతి తెలిసిందే. అయితే సమంతకు బధులుగా ఈ అవార్డును నాని తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ మేరకు సమంత ఓ పోస్ట్ చేసింది. థ్యాంక్యూ నాని.. నా బదులు ఈ అవార్డును తీసుకున్నావ్.. కానీ ఉత్తమ నటి అవార్డును నువ్ తీసుకుంటావ్ అని.. ఎప్పుడైనా ఇలా జరుగుతుందని నువ్ ఆలోచించావా? అని నవ్వుతున్న ఎమోజీలను సమంత షేర్ చేసింది. ఇక జెర్సీ సినిమాకు అవార్డులు రావడంపై నానికి కూడా కంగ్రాట్స్ చెప్పింది సమంత. జెర్సీలో నువ్ అద్భుతంగా నటించేశావ్ అని చెప్పేసింది. ఈగ సినిమాతో నాని, సమంత మధ్య మంచి స్నేహం ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఇక ఓ బేబీకి అవార్డులు రావడంపై సమంత ఎమోషనల్ అవుతూ.. నందినీ రెడ్డితో మరో సినిమా రెడీ చేయమని చెప్పింది. త్వరలోనే మళ్లీ మనిద్దరం కలిసి సినిమా చేద్దామని సమంత అడిగింది .దానికి నందినీ రెడ్డి సమాధానం ఇస్తూ.. అల్రెడీ స్క్రిప్ట్ రెడీ అవుతోంది.. కలిసి కుమ్మేద్దాం అని చెప్పేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Drugs Case ప్రకంపనలు.. బండి సంజయ్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌ను లాగిన మాజీ ఎంపీ, కేటీఆర్‌కి నో

Mon Sep 20 , 2021
White Challenge: డ్రగ్స్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. మాదక ద్రవ్యాలు తీసుకోలేదని తమ సచ్చీలతను నిరూపించుకోవాలంటూ రేవంత్ విసిరిన సవాల్‌కి మాజీ ఎంపీ స్పందించారు. మంత్రి కేటీఆర్ కోర్టుకెక్కారు.