అందులో నువ్ కేక.. బన్నీపై సల్మాన్ ఖాన్ ప్రశంసలు

సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా తెరకెక్కించిన చిత్రం రాధే. ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైనప్పటి నుంచి అల్లు అర్జున్ డీజే సినిమాలో సీటీమార్ సాంగ్ ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ ఆ పాటను తన సినిమాలో వాడేసుకోవడంతో హాట్ టాపిక్ అయింది.

ప్రధానాంశాలు:అల్లు అర్జున్ పాటను వాడిన సల్మాన్ ఖాన్సీటీమార్ వీడియో సాంగ్బన్నీపై సల్మాన్ ప్రశంసలుఇండియన్ స్క్రీన్ మీద డ్యాన్సులు వేయాలంటే అది కొంత మందికే సాధ్యమవుతుంది. బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లు డ్యాన్సులకు ఫేమస్. వీరు మినహా మిగతా అంతా కూడా సోసోగానే ఉంటారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే దాదాపు అరడజన్ హీరోలు డ్యాన్సుల్లో ఇరగ్గొట్టేసే వారున్నారు. అందులో ఎవరి శైలి వారికి ఉంది.కానీ బన్నీ డ్యాన్సులు, గ్రేసులు అంటే అందరూ ఇష్టపడుతుంటారు. తాజాగా సల్మాన్ ఖాన్ సైతం బన్నీ డ్యాన్సులకు ఫిదా అయ్యారు.

డీజే సినిమాలోని సీటీమార్ సాంగ్‌లో బన్నీ ఏ రేంజ్‌లో స్టెప్పులు వేశారో అందరికీ తెలిసిందే. అవి ఐకానిక్ స్టెప్పుల్లా మారిపోయాయి. అలాంటి పాటను సల్మాన్ ఖాన్ వాడుకోవడం విశేషమే. పైగా బన్నీ స్టైల్ స్టెప్పులను కాపీ కొట్టడం, బన్నీ స్టైల్లో డ్యాన్సులు వేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ విషయాన్ని పరోక్షంగా అంగీకరిస్తూనే సల్మాన్ తాజాగా ఓ ట్వీట్ వేశారు.
అది ఇప్పుడు చాలా అవసరం.. వ్యాక్సినేషన్‌పై మహేష్ బాబు కామెంట్స్
రాధే సినిమాలోని సీటీమార్ వీడియో సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ మేరకు సల్మాన్ ఖాన్ బన్నీకి థ్యాంక్స్ చెప్పారు. తన పాటను వాడుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అని సల్మాన్ ట్వీట్ వేశారు. అంతేకాకుండా ఈ పాటలో అల్లు అర్జున్ డ్యాన్స్ చేసిన తీరు, స్టైల్, అన్నీ కూడా ఫెంటాస్టిక్ కేక అన్నట్టుగా ప్రశంసలు కురిపించేశారు. లవ్యూ బ్రదర్ అంటూ అల్లు అర్జున్‌ను ఆకాశానికెత్తేశారు.

ఇక సల్మాన్ ప్రశంసలకు బన్నీ తబ్బిబ్బైపోయారు. ఈ మేరకు సల్మాన్‌కు థ్యాంక్స్ చెప్పారు. ఇలా మీ దగ్గరి నుంచి ప్రశంసలు రావడం ఎంతో సంతోషంగా ఉంది. మీరెంతో మంచి వారు. రాధే సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. సీటీమార్ పాటకు మీ అభిమానులు స్టెప్పులు వేయడం కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు చూపించిన ప్రేమకు థ్యాంక్స్ అని అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Amazon App Quiz: నేటి సమాధానాలు ఇవే.. రూ.10 వేలు గెలవచ్చు!

Mon Apr 26 , 2021
అమెజాన్ తన యాప్‌లో రోజూ ఒక క్విజ్‌ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో ఈరోజు(ఏప్రిల్ 26వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇవే.. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.10 వేలు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం లభిస్తుంది.