10 వారాల గరిష్టానికి రూపాయి!

రూపాయి ఈ వారం లాభపడింది. శుక్రవారం కూడా రూపాయి పైపైకి కదిలింది. 53 పైసలు బలపడింది. అదే వారం ప్రాతిపదికన చూస్తే అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి 70 పైసలు పెరిగింది.

ప్రధానాంశాలు:అదరగొట్టిన రూపాయి10 వారాల పైకిడాలర్ కిందకుఇండియన్ రూపాయి అదరగొట్టింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే బలపడింది. శుక్రవారం రోజున ఇండియన్ రూపాయి 53 పైసలు పైకి కదిలింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.69 వద్ద క్లోజ్ అయ్యింది.

జూన్ 16 నుంచి చూస్తే.. రూపాయికి ఇదే గరిష్ట స్థాయి. అంటే ఇండియన్ రూపాయి 10 వారాల గరిష్టానికి చేరిందని చెప్పుకోవచ్చు. 74.17 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 74.20 వరకు క్షీణించింది. 73.69 వరకు లాభపడింది.

చివరకు 73.69 వద్ద క్లోజ్ అయ్యింది. గత క్లోజింగ్‌తో పోలిస్తే రూపాయి 53 పైసలు బలపడింది. ఏప్రిల్ 16 నుంచి రోజూ వారి ప్రాతిపదికన చూస్తే రూపాయికి ఇదే అతిపెద్ద పెరుగుదల అని చెప్పుకోవచ్చు. వారం ప్రాతిపదికన చూస్తే.. రూపాయి 70 పైసలు లాభపడింది. ఇకపోతే అమెరికా డాలర్ క్షీణించింది. 93.002 వద్ద ఉంది.

Also Read: అమెజాన్ శుభవార్త.. క్రెడిట్ కార్డు లేని వారి కోసం కొత్త సేవలు?

Also Read: జీఎస్‌టీ చెల్లింపుదారులకు హెచ్చరిక.. సెప్టెంబర్ 1 నుంచి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Pujaraకి సెంచరీ మిస్.. రివ్యూకి వెళ్లి మరీ వికెట్ సాధించిన ఇంగ్లాండ్

Sat Aug 28 , 2021
లీడ్స్ టెస్టులో సెంచరీ సాధించేలా కనిపించిన చతేశ్వర్ పుజారా.. అనూహ్యరీతిలో శతకం ముంగిట వికెట్ చేజార్చుకున్నాడు. ఫీల్డ్ అంపైర్ ఫస్ట్ ఔటివ్వకపోయినా.. ఇంగ్లాండ్ కెప్టెన్