లాక్ డౌన్ సడలింపు: TSRTC బస్ టైమింగ్స్‌లో మార్పులు.. ఈ సమయానికే లాస్ట్ బస్సు

Lockdown in Telangana: ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీఎస్ఆర్టీసీ సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్‌ ఈడీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

ప్రధానాంశాలు:లాక్ డౌన్ సడలింపులతో ఆర్టీసీ వేళల్లో మార్పులుఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా..బస్ పాస్ కౌంటర్లు కూడా..తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలు మినహా పగటి పూట లాక్‌డౌన్‌ను సర్కారు ఎత్తివేసిన వేళ బస్సు సర్వీసుల వేళలను TSRTC పొడిగించింది. సడలింపులకు అనుగుణంగా 10వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలకు నడిపే బస్సులను తిప్పనున్నట్లు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,600 బస్సులను మధ్యాహ్నం 2 గంటల వరకు నడుపుతున్నామని.. వాటినే సాయంత్రం 6 గంటల వరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీఎస్ఆర్టీసీ సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్‌ ఈడీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. లాక్ డౌన్ విరామ సమయంలో సిటీ బస్సులను తిప్పుతామని ఈడీ తెలిపారు. గ్రేటర్ పరిధిలోని బస్ పాస్ కౌంటర్లన్నీ ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పనిచేస్తాయని చెప్పారు.

మెట్రో టైమింగ్స్ ఇలా..
ఇటు, మెట్రో ప్రయాణికులకు కూడా ఊరట లభించింది. ఈ మేరకు ఈనెల 10 నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే రైళ్లు సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా తిరగనున్నాయి. దీంతో చివరి రైలు సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి ఆఖరి స్టేషన్‌కు 6 గంటల వరకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

షాకింగ్! ఈ ప్రైవేట్ ఆస్పత్రులకు భారీ ఊరట.. కానీ, దాని బదులుగా ఇలా.. ప్రభుత్వం వెల్లడి TPCC గొడవ: నాకే అలా జరిగింది, పట్టించుకునే నాథుడే లేడు.. వీహెచ్ కీలక వ్యాఖ్యలు CJI ఎన్వీ రమణ కీలక నిర్ణయం.. తీరిన తెలంగాణ హైకోర్టు చిరకాల కోరిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

భర్తతో జెనీలియా ఘాటు రొమాన్స్.. ఒక్కసారిగా అతన్ని చూసి షాకైన రితేష్.. వీడియో వైరల్

Wed Jun 9 , 2021
రితేశ్ దేశ్‌ముఖ్, జెనిలియా దంపతులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆన్ లైన్ వేదికగా నిత్యం తమ తమ అభిమానులతో టచ్‌లో ఉండే ఈ జోడీ తాజాగా ఓ వెరైటీ రొమాంటిక్ వీడియోతో అట్రాక్ట్ చేసింది.