బస్సు నడుపుతుండగా గుండెపోటు.. ప్రయాణికులను కాపాడి మృతిచెందిన డ్రైవర్

వాహనం నడుపుతుండగా గుండెపోటుకు గురైన డ్రైవర్.. బస్సును పక్కకు తీసి నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ ఆయన అలా చేసుండకపోతే ఘోరం జరిగిపోయేది.

ప్రధానాంశాలు:గుండెపోటుతో ప్రాణాలొదిలిన ఆర్టీసీ డ్రైవర్.బస్సును పక్కకు నిలపడంతో తప్పిన ముప్పు.ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికులు.బస్సు నడుపుతుండగా డ్రైవర్‌ హఠాత్తుగా గుండెపోటుకు గురికాగా.. వాహనాన్ని చాకచక్యంగా నిలిపి ప్రయాణికులను రక్షించాడు. అనంతరం బస్సులోనే డ్రైవర్ మృతిచెందిన విషాద ఘటన చెన్నై సమీపంలో చోటుచేసుకుంది. ఈరోడ్‌ జిల్లా గవుందంపాడి సమీపం మనియన్‌కాట్టూర్‌ ప్రాంతానికి చెందిన సెల్వరాజ్‌ (52) తమిళనాడు ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొండుపాడి డిపోలో పనిచేస్తున్న సెల్వరాజ్.. ఆదివారం ఉదయం గవుందంపాడి నుంచి పెరుందురై మార్గంలో బస్సును నడుపుతున్నాడు.

మార్గమధ్యంలో వెల్లంకోయిల్‌ బస్టాండ్‌‌కు బస్సు చేరుకోగా.. అక్కడ కొంత మంది ప్రయాణికులు దిగారు. తర్వాత వెల్లంకోయిల్ నుంచి బయలుదేరి కొద్ది దూరం వెళ్లేసరికి సెల్వరాజ్‌ హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. గోపిశెట్టిపాళయం వద్ద రోడ్డు పక్కన బస్సు నిలిపి స్పృహతప్పి పడిపోయాడు. దీనిని గమనించిన కండక్టర్‌ కనకసభాపతి ప్రయాణికుల సాయంతో సెల్వరాజ్‌ను సిరువాలూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అయితే, డ్రైవర్ సెల్వరాజ్ అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

సెల్వరాజ్ గుండెపోటు కారణంగా మార్గమధ్యంలోనే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. తన ప్రాణాలు పోతున్నా బస్సులోని ప్రయాణికుల కోసం సెల్వరాజ్ తాపత్రయపడ్డారు. ఒకవేళ బస్సును సరైన సమయంలో బస్సు నిలిపి ఉండకపోతే రోడ్డు పక్కనే ఉన్న ఇళ్లలోకి దూసుకెళ్లేంది. సెల్వరాజ్ వాహనాన్ని పక్కకు తీసి నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. గుండెపోటుతో చనిపోయిన సెల్వరాజ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

టీఆర్ఎస్‌లో చేరిన ఎల్. రమణ.. కేటీఆర్ చేతుల మీదుగా సభ్యత్వం

Mon Jul 12 , 2021
మంత్రి కేటీఆర్ చేతులు మీదుగా రమణ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా రమణకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే ఆయన టీడీపీకి రాజీనామా చేశారు.