7 జిల్లాల్లో డ్రైవింగ్‌ లైసెన్సు పరీక్షలు.. నేటి నుంచి అందుబాటులోకి

నేటి నుంచి కర్ఫ్యూ సడలింపులు ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలో నేటి నుంచి ఆర్టీఏ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏడు జిల్లాల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి.

ప్రధానాంశాలు:నేటి నుంచి ఆర్టీఏ సేవలు ప్రారంభంరాష్ట్రంలోని ఏడు జిల్లాలో అందుబాటులోకిజులై 1 నుంచి మిగిలిన జిల్లాలోనూ ప్రారంభంకరోనా కారణంగా రవాణా శాఖ కార్యాలయాల్లో నిలిచిపోయిన లెర్నర్‌, డ్రైవింగ్‌ లైసెన్సు పరీక్షలు ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో మే నుంచి ఈ పరీక్షలను వాయిదా వేశారు. అయితే సోమవారం నుంచి కర్ఫ్యూ సడలింపులు ఇవ్వనున్న నేపథ్యంలో సోమవారం నుంచి విజయనగరం, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో వీటిని ప్రారంభిస్తారు.

జులై 1 నుంచి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోనూ ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మే, జూన్‌లలో స్లాట్లు పొందిన వారికి ముందుగా అవకాశం ఇవ్వనున్నారు. వారం రోజుల్లో వీరంతా తమకు వీలున్న తేదీని రవాణాశాఖ పోర్టల్‌లోనే ఎంపిక చేసుకుని స్లాట్‌ పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

WTC Finalలో జెమీషన్‌కి 5 వికెట్లు.. టెస్టుల్లో 70ఏళ్ల నాటి రికార్డ్‌ బ్రేక్

Mon Jun 21 , 2021
భారత్‌తో గత ఏడాది జరిగిన టెస్టు సిరీస్‌‌తో న్యూజిలాండ్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జెమీషన్.. ఇప్పుడు స్టార్‌గా ఎదిగిపోయాడు. రోహిత్, కోహ్లీ, పంత్‌లను ఔట్ చేసిన ఈ పొడవాటి పేసర్..