మ్యాజిక్ రిపీట్ చేయగలడా?.. ఐదేళ్ల తరువాత అలా.. అలియా-రణ్‌వీర్‌లతో కరణ్ జోహర్

కరణ్ జోహర్ దర్శకుడి ఎంతటి సంచలన విజయాలను అందుకున్నారో అందరికీ తెలిసిందే. ఇక నిర్మాతగానూ కరణ్ జోహర్ బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు.ఎంతో మంది వారసులను తన సొంత నిర్మాణ సంస్థ నుంచి లాంచ్ చేశారు.

ప్రధానాంశాలు:మ్యాజిక్ రిపీట్ చేయగలడా?ఐదేళ్ల తరువాత డైరెక్షన్అలియా-రణ్‌వీర్‌లతో కరణ్ జోహర్కరణ్ జోహర్ దర్శకుడి ఎంతటి సంచలన విజయాలను అందుకున్నారో అందరికీ తెలిసిందే. ఇక నిర్మాతగానూ కరణ్ జోహర్ బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు.ఎంతో మంది వారసులను తన సొంత నిర్మాణ సంస్థ నుంచి లాంచ్ చేశారు. ఎంతో మందిని నిలబెట్టేశారు. అయితే కరణ్ జోహర్ దర్శకత్వం వహించి దాదాపు ఐదేళ్లు అవుతోంది. చివరగా లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌లోని కియారా అద్వాణీ ఎపిసోడ్‌ను డైరెక్ట్ చేశారు.
KGF Chapter 2 రాబోయేది అప్పుడే.. మేకర్స్ అధికారక ప్రకటన
ఈ ఐదేళ్లలో కరణ్ జోహర్ రకరకాల చిత్రాలను నిర్మించారు. అలియా భట్, వరుణ్ ధావణ్ వంటి వారిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ దర్శకత్వం వైపు కరణ్ అడుగులు వేశారు. కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ ఘమ్ వంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్‌లను తెరకెక్కించిన కరణ్ జోహర్ మళ్లీ ఓ అందమైన ప్రేమ కథను తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు.

బంధాలు, బంధుత్వాలు, ఆచారాలు సంప్రదాయాలు అంటూ తన మార్క్‌ను చూపేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు అదిరిపోయే ప్రకటనను చేశారు. రణ్ వీర్ సింగ్, అలియా భట్‌లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ వంటి లెజెండ్లు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారంటూ కరణ్ తన సినిమా గురించి చెప్పారు. రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని అంటూ మరో అందమైన ప్రేమ కథను ప్రేక్షకులకు అందించేందుకు కరణ్ సిద్దమయ్యారు. ఈ చిత్రం 2022లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు. మొత్తానికి రణ్ వీర్ సింగ్ బర్త్ డే సందర్భంగా ఇలా కొత్త సినిమాను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మానసికంగా అలసటగా ఉంటోందా.. ఇలా చేయండి..

Tue Jul 6 , 2021
ప్రస్తుతం అందరికీ ఈ మానసికమైన అలసట ఉంటోంది, ఈ అలసట మీకు మాత్రమే అనుకోకండి. సుమారుగా సంవత్సరం పైగా మహమ్మారి గురించిన సమాచారం మనకి ఎక్కువగా తెలుస్తోంది. ఎక్కువ మంది ఇంట్లో నుండే పని చేస్తున్నారు. అది కూడా ఒక రకమైన ఒత్తిడికి, ఆందోళనకి కారణమవుతోంది.