అది రాజమౌళి సినిమా సత్తా.. దేశంలోనే అతిపెద్ద రికార్డు సాధించిన ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’

బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా తనకంటూ ఓ ట్రేడ్ మార్క్‌ను సృష్టించారు జక్కన రాజమౌళి. అలాంటి గ్రాండ్ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ అనే మేకింగ్ వీడియో తాజాగా దేశంలోనే అతిపెద్ద రికార్డును సాధించింది.

బాహుబలి సిరీస్ సినిమాలతో తెలుగు సినిమా కీర్తిని ప్రపంచదేశాలకు పరిచయం చేశారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఈ సినిమాలతో ఆయన యావత్ ప్రపంచ సినీ అభిమానులను మాయాజాలంలో ముంచెత్తారు. అంతేకాదు.. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా ఎన్నో రికార్డులను సాధించి.. చరిత్ర సృష్టించింది. అయితే అలాంటి గ్రాండ్ సినిమా తర్వాత రాజమౌళి దాన్ని తలదన్నే సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు. అంతే.. మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమాకి రూపకల్పన చేశారు జక్కన.

ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి చాలాకాలం అయింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల.. కరోనా వ్యాప్తి కారణంగా సినిమా విడుదల వాయిదాపడుతూ వస్తోంది. వీటన్నిటి మధ్యలో సినిమా నుంచి వచ్చిన టీజర్లు, పోస్టర్లు అంచనాలను తారాస్థాయి పెంచేశాయి. తన స్టాండర్డ్స్‌కి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాని రూపొందిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాలో స్వతంత్ర పోరాట యోధులు అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. వీరికి జోడీగా ఆలియా భట్, ఒలివియా మోరిస్ చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర యూనిట్ అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ పేరుతో ఓ మేకింగ్ వీడియోని విడుదల చేసింది. మేకింగ్ వీడియోని ప్రతీ షాట్.. ప్రతీ ఫ్రేమ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాను తెరకెక్కించడానికి ప్రతీ ఒక్కరు ఎంత కష్టపడ్డారో ఈ వీడియో చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే విడుదలైన అనతికాలంలోనే ఈ వీడియో యూట్యూబ్‌లో పలు రికార్డులను బ్రేక్ చేసింది. విడుదలైన 24 గంటల్లోనే అత్యధికంగా వీక్షణ పొందిన తొలి మేకింగ్ వీడియోగా ఇది చరిత్ర సృష్టించింది.

అయితే ఇప్పటి వరకూ ఈ వీడియోకు 6.3 మిలియన్ వ్యూస రాగా.. 457 వేల లైక్స్‌ను వచ్చాయి. భారతదేశ వ్యాప్తంగా ఇంత తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ సాధించిన తొలి మేకింగ్ వీడియో రికార్డుల్లోకి ఎక్కింది. మేకింగ్ వీడియోనే ఇన్ని రికార్డులు సాధిస్తే.. ఇక ట్రైలర్ వస్తే ఎన్ని రికార్డులు బద్దలుకొడుతుందో? అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్, శ్రియ శరణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రూ.18 వేలలోపే ల్యాప్‌టాప్.. లాంచ్ చేసిన అసుస్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Fri Jul 16 , 2021
ప్రముఖ టెక్ దిగ్గజం అసుస్ తన కొత్త ల్యాప్‌టాప్‌లను మనదేశంలో లాంచ్ చేసింది. వీటి ధర మనదేశంలో రూ.17,999 నుంచి ప్రారంభం కానుంది. జులై 22వ తేదీన వీటి సేల్ జరగనుంది.