కొత్తగా బైక్ కొనే వారికి శుభవార్త.. ఏకంగా రూ.28000 భారీ తగ్గింపు!

మీరు బైక్ కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు లభిస్తోంది. రివోల్ట్ మోటార్స్ కంపెనీ తాజాగా తన బైక్‌ ధరను రూ.28 వేలు తగ్గించేసింది.

ప్రధానాంశాలు:బైక్ కొనే వారికి తీపికబురుభారీ తగ్గింపుఈ బైక్‌కు మాత్రమే వర్తింపుకొత్తగా బైక్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. బైక్ కొనుగోలుపై భారీ తగ్గింపు లభిస్తోంది. ఏకంగా రూ.28 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. బైక్ కొనే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు.

ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను తయారు చేసే ప్రముఖ వాహన తయారీ కంపెనీ రివోల్ట్ మోటార్స్ తాజాగా తన పాపులర్ బైక్‌ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ బైక్ ఆర్‌వీ400 ధరను భారీగా తగ్గించింది. ధరలో ఏకంగా రూ.28,201 కోత విధించింది. దీంతో ఈ బైక్ ఇప్పుడు మరింత అందుబాటు ధరలో కస్టమర్లకు లభిస్తోందని చెప్పుకోవచ్చు.

Also Read: బంగారం కొనే వారికి అదిరిపోయే శుభవార్త.. భారీగా దిగొచ్చిన రేట్లు.. వెండిదీ ఇదే దారి!

తాజా రేటు తగ్గింపు నిర్ణయంతో రివోల్ట్ ఆర్‌వీ 400 బైక్ ధర రూ.90,799కు దిగొచ్చిందని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఫేమ్ 2 సబ్సిడీ స్కీమ్‌లో మార్పులు చేయడం వల్ల కంపెనీ ఇలా బైక్ ధరను భారీగా తగ్గించింది. ఇది వరకు ఈ బైక్ ధర రూ.1,19,000గా ఉండేది.

ఇకపోతే ఆర్‌వీ 400 బైక్‌లో 3కేడబ్ల్యూ మోటార్, 72వీ 3.24 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీంతో మీరు ఈ బైక్‌లో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లొచ్చు. ఇంకా ఈ బైక్‌లో మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఎకో, నార్మల్, స్పోర్ట్ అనేవి ఇవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

దేశ చట్టాలే అత్యున్నతం.. మీ విధానాలు కాదు: ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ షాక్

Sat Jun 19 , 2021
New IT Rules కేంద్రంతో కొద్ది రోజులుగా ఢీ అంటే ఢీ అంటోన్న సామాజిక మాధ్యమం ట్విట్టర్‌కు పార్లమెంటరీ స్థాయీ సంఘం ఝలక్ ఇచ్చింది.