ఎంపీ రఘురామపై రాజద్రోహం కేసుపెట్టిన విశ్రాంత అధికారి సీఐడీ ఓఎస్డీగా!

ప్రభుత్వంపై ఓ పథకం ప్రకారమే వ్యాఖ్యలు చేస్తూ కొన్ని ఛానెల్స్‌తో కలిసి కుట్రచేశారని ఆరోపిస్తూ నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే.

ప్రధానాంశాలు:ఎంపీ రఘురామపై రాాజద్రోహం కేసు.జూన్ 30న పదవీ విరమణ చేసిన అధికారి.సీఐడీ సూపరింటెండ్‌గా పనిచేసిన విజయపాల్ఏపీ సీఐడీ ఓఎస్‌డీగా విశ్రాంత అధికారి విజయ్‌పాల్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన జూన్‌ 30న సీఐడీ నుంచి పదవీ విరమణ పొందారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, ఏబీఎన్‌ సహా మరో ఛానల్‌పై విజయ్‌పాల్ సుమోటోగా రాజద్రోహం కేసు పెట్టారు. తాజాగా ఆయనను కాంట్రాక్ట్ పద్ధతిలో ఓఎస్‌డీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విజయ్‌పాల్ 2022 జూన్ 30 వరకు పదవిలో కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక, ఇంటెలిజెన్స్ మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు కేసులోనూ విజయ్‌పాల్ కీలక పాత్ర పోషించారు.

ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన తర్వాత‘ఐపీసీ సెక్షన్‌ 124 (ఏ), 153, 505 రెడ్‌విత్‌ 120బీ సెక్షన్ల కింద సీఐడీ పోలీసుస్టేషన్‌లో క్రైమ్‌ నెంబర్‌ 12/2021 కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేస్తున్నాం.. ఇది బెయిల్‌కు వీలులేని కేసు.. ఆయన న్యాయస్థానం ద్వారానే బెయిల్‌ పొందేందుకు వీలుంది’ అని పేర్కొంటూ అప్పటి సీఐడీ ప్రాంతీయ కార్యాలయం అదనపు సూపరింటెండెంట్‌ ఆర్‌.విజయ్‌పాల్‌ సంతకంతో కూడిన ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే.

ఒక పథకం, ప్రణాళిక ప్రకారం కులాల మధ్య విద్వేషాలు, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా రఘురామకృష్ణరాజు వ్యవహరించినట్టు సీఐడీ ఆరోపించింది. ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తుల్ని ఆయన లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఆయన ప్రసంగాలు, చర్యలు విద్వేషపూరితంగా ఉన్నాయని తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు మీడియా ఛానళ్లతో కలిసి రాష్ట్రంలో సామాజిక, ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు రఘురామకృష్ణరాజు కుట్ర చేశారని, అందుకే ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని సీఐడీ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

బంగాళఖాతంలో అల్పపీడనం... తెలంగాణకు భారీ వర్షాలు

Sat Jul 10 , 2021
రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల అతిభారీ వర్షాలు కురువొచ్చని పేర్కొన్నది. మరోవైపు రుతు పవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి.