కుర్రాళ్లకు కిక్ ఇస్తున్న సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ తొలి పాట..

యువ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రిపబ్లిక్’. అవినీతికి .. అన్యాయాలకు ఆశ్రయం కల్పిస్తున్న రాజకీయాల చుట్టూ అల్లిన కథ ఇది. వీటిని ఎదురుకొని ఓ కాలేజీ కుర్రాడి పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘గానా ఆఫ్ రిపబ్లిక్’ అనే పాటని చిత్ర యూనిట్ విడుదల చేశారు.

‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో ఈ ఏడాది మంచి సక్సెస్ అందుకున్నాడు యువ హీరో సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా సక్సెస్‌తో అతను వరుస సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. అందులో ప్రస్తుతం విడుదలకు రెడీ అవుతున్న సినిమా ‘రిపబ్లిక్’. దేవ కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తేజ్ సరసన ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, రమ్యకృష్ణలు సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అవినీతికి .. అన్యాయాలకు ఆశ్రయం కల్పిస్తున్న రాజకీయాల చుట్టూ తిరిగే కథ ఇది. ఇలాంటి రాజకీయాల తీరుపై నిరసన గళం వినిపించే ఒక పౌరుడి కథ ఇది. భారీ బడ్జెట్‌తో భగవాన్ – పుల్లారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘గానా ఆఫ్ రిపబ్లిక్’ అంటూ విడుదలైన ఈ పాట.. ప్రస్తుతం అందరిని.. ముఖ్యంగా కుర్రాళ్లను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా మణిశర్మ అందించిన సంగీతం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. హక్కుల రెక్కలను విరిచేసి … రంగుల కలలను చెరిపేస్తున్నారు. స్వేచ్ఛ అనేది ఇంకా పంజరంలోనే బంధించబడి ఉంది అనే అర్థం వచ్చేలా ఈ పాట సాగుతుంది. ఈ పాటకు రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చారు. రాజు సుందరం కొరియోగ్రాఫీ అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ పాట విన్న నెటిజన్లు.. ఇది చూస్తుంటే.. సినిమా కూడా ఇదే రేంజ్‌లో హిట్ అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా ఆష్లే బార్టీ.. 41 ఏళ్ల తర్వాత టైటిల్ నెగ్గిన తొలి ఆస్ట్రేలియన్

Sun Jul 11 , 2021
Ashleigh Barty ఆల్‌ ఇంగ్లాండ్‌ క్లబ్‌లో జరిగిన వింబుల్డన్ ఆఖరి సమరంలో ఆస్ట్రేలియాకు చెందిన ప్రపంచ నెంబర్‌వన్ క్రీడాకారిణి అదరగొట్టింది.