తెలంగాణలో సర్వర్లు జామ్.. నేడు రిజిస్ట్రేషన్లు బంద్

రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు సహా ఇతర సేవలు అందుబాటులో ఉండవు. సోమవారం వరకు ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగవు. గురువారం నుంచే కార్యాలయాల్లో సర్వర్లు జామ్‌ అయ్యాయి.

ప్రధానాంశాలు:మూడురోజుల పాటు నిలిచిపోనున్న సేవలుఎస్‌డీసీలో కొత్త యూపీఎస్ ఏర్పాటు సోమవారం తిరిగి ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు తెలంగాణలో ఇవాళ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. మూడు రోజుల పాటు ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరిగే పరిస్థితి లేదు. తిరిగి సోమవారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌ సేవలు గురువారం రాత్రి 7 గంటలకే నిలిచిపోయాయి. శుక్రవారం రోజంతా రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు సహా ఇతర సేవలు అందుబాటులో ఉండవు. రెండో శనివారం, ఆదివారం వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో తిరిగి సోమవారం రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.

స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ చేపట్టే రిజిస్ట్రేషన్ల ‘కార్డు’ పోర్టల్‌ గచ్చిబౌలిలోని స్టేట్‌ డేటా సెంటర్‌(ఎ్‌సడీసీ)కు అనుసంధానమై ఉంది. ఎస్‌డీసీలో మెరుగైన పవర్‌ బ్యాకప్‌ కోసం శుక్రవారం నుంచి కొత్త యూపీఎస్‌ ఏర్పాటు పనులు కొనసాగనున్నాయి. ఇలా ఎస్‌డీసీ స్తంభించిపోతుండటంతో రిజిస్ట్రేషన్ల కార్డు పోర్టల్‌ కూడా పని చేయదు. దీంతో శుక్రవారం రాష్ట్రంలోని 141 సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు కొనసాగే పరిస్థితి లేదు. గురువారం నుంచే కార్యాలయాల్లో సర్వర్లు జామ్‌ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Zika Virus in Kerala: కేరళలో కలకలం.. తొలిసారి జికా వైరస్ కేసు నమోదు

Fri Jul 9 , 2021
కరోనాతో సతమతమవుతున్న వేళ.. ఫంగస్‌లు వెంటాడుతుండగా.. కొత్తగా జికా వైరస్ కేసులు బయటపడటం దేశంలో కలవరం మొదలయ్యింది. తొలిసారిగా కేరళలో 13 కేసులు నమోదయ్యాయి.