రూ.15 వేలలోపే 5జీ ఫోన్.. రెడ్‌మీ నోట్ 10టీ 5జీ ధర లీక్!

షియోమీ ఈ నెల 20వ తేదీన రెడ్‌మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోన్ ధర ఆన్‌లైన్‌లో లీకైంది. రూ.14,999కే ఈ ఫోన్ లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి.

ప్రధానాంశాలు:ధర రూ.14,999గా ఉండనుందని వార్తలుజులై 20వ తేదీన లాంచ్రెడ్‌మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్ ఫోన్ ధర, వేరియంట్లకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ ఫోన్ మనదేశంలో జులై 20వ తేదీన లాంచ్ కానున్నాయని కంపెనీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన టీజర్లు కూడా మెల్లగా విడుదల అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా వచ్చిన లీకు ప్రకారం.. ఇందులో ఒకే ఒక్క వేరియంట్ ఉండనుంది. రెడ్ మీ నోట్ 10 5జీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా రెడ్‌మీ నోట్ 10టీ 5జీ లాంచ్ కానుంది.

రెడ్‌మీ నోట్ 10టీ 5జీ ధర (అంచనా)
షియోమీ సెంట్రల్ కథనం ప్రకారం.. ఇందులో ఒక్క వేరియంట్ మాత్రమే ఉండనుంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో రానున్న ఈ వేరియంట్ ధరను రూ.14,999గా నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. ఈ కథనం ప్రకారం.. ఈ ఫోన్‌పై లాంచ్ ఆఫర్లు కూడా ఉండనున్నాయి. ఈ ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉండనుంది. రష్యాలో ఈ ఫోన్ బ్లూ, గ్రీన్, గ్రే, సిల్వర్ రంగుల్లో లాంచ్ అయింది. మనదేశంలో కూడా ఇదే రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ఈ బడ్జెట్ ఒప్పో ఫోన్ ధర పెరిగింది.. అయినా రూ.15 వేలలోపే!
రెడ్‌మీ నోట్ 10టీ 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ హోల్ పంచ్ అడాప్టివ్ సింక్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.

ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు.

ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.92 సెంటీమీటర్లుగానూ, బరువు 190 గ్రాములుగానూ ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ 2 ధర లీక్.. మొదటిసారి ఆ ధరతో నార్డ్ సిరీస్ ఫోన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఆడవాళ్లకు బాత్రూంలంటే ఇష్టం!.. సెల్ఫీలతో పూనమ్ కౌర్ హల్చల్

Wed Jul 14 , 2021
నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. ఆమె వేసే ట్వీట్లు, చేసే పోస్ట్‌లు ఎప్పుడూ కూడా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంటాయి. అలా పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారుతుంటారు.