50 మెగాపిక్సెల్ కెమెరాతో రానున్న రెడ్‌మీ 10.. ఇతర ఫీచర్లు కూడా లీక్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన రెడ్‌మీ 10 సిరీస్‌ను ఇటీవలే మనదేశంలో లాంచ్ చేయనున్నట్లు టీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోన్ కీలక ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

ప్రధానాంశాలు:50 మెగాపిక్సెల్ కెమెరా ఉండే అవకాశం5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా..రెడ్‌మీ 10 సిరీస్‌ను షియోమీ ఇటీవలే టీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ ఇప్పుడు ఎఫ్‌సీసీ(ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్) వెబ్‌సైట్లో కనిపించింది. ఈ లిస్టింగ్‌లో ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. దీని ప్రకారం.. ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉండనున్నాయి. ఐఎంఈఐ లిస్టింగ్‌లో ఈ ఫోన్ మార్కెటింగ్ నేమ్ లీక్ అయింది.

ఈ రెడ్‌మీ 10 స్మార్ట్ ఫోన్ ఎఫ్‌సీసీ, ఐఎంఈఐ సర్టిఫికేషన్ సైట్లలో 21061119AG అనే మోడల్ నంబర్‌తో కనిపించింది. ఈ రెండు సర్టిఫికేషన్ లిస్టింగ్‌లను మొదట 91మొబైల్స్ గుర్తించింది. అయితే ఐఎంఈఐ లిస్టింగ్‌లో ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు మాత్రం లీకవ్వలేదు.
రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ లాంచ్ తేదీ వచ్చేసింది.. ధర, ఫీచర్లు లీక్!
ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. 4జీ సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.

ఈ ఫోన్ ఇండియా, యూరోప్, రష్యా, మలేషియా, సింగపూర్ దేశాల్లో లాంచ్ కానున్నట్లు ఈ సర్టిఫికేషన్ వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. రెడ్‌మీ 10 ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం.. ఇందులో 50 మెగాపిక్సెల్ శాంసంగ్ ఎస్5కేజేఎన్1 సెన్సార్, 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉండనున్నాయి.

గత నెల చివరిలో రెడ్‌మీ 10 సిరీస్‌ను మనదేశంలో లాంచ్ చేయనున్నట్లు షియోమీ టీజ్ చేసింది. అప్పటినుంచి ఈ ఫోన్ గురించి మళ్లీ ఎటువంటి అప్‌డేట్ లేదు. రెడ్‌మీ 9 సిరీస్ గతేడాది ఆగస్టులో లాంచ్ అయింది. ఇప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ తర్వాతి వెర్షన్ కూడా ఈ సంవత్సరం ఆగస్టులోనే లాంచ్ అవుతుందని సమాచారం. రెడ్‌మీ 9 సిరీస్‌లో ఇప్పటికే రెడ్‌మీ 9 పవర్, రెడ్‌మీ 9ఏ, రెడ్‌మీ 9ఐ ఫోన్లు లాంచ్ అయ్యాయి. అయితే రెడ్‌మీ 10 సిరీస్‌లో మొదట ఏ ఫోన్ లాంచ్ అవుతుందో మాత్రం తెలియరాలేదు.
పోకో ఎఫ్3 జీటీ ధర లీక్.. మిడ్‌రేంజ్‌లోనే అదిరిపోయే గేమింగ్ ఫోన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రేషన్ కార్డు కలిగిన వారికి శుభవార్త.. తొలిసారిగా..

Fri Jul 16 , 2021
దేశంలో తొలిసారిగా రేషన్ ఏటీఎం ఏర్పాటైంది. దీని ద్వారా సులభంగానే రేషన్ సరుకులు పొందొచ్చు. ఒకేసారి 70 కేజీల రేషన్ పొందొచ్చు. హరియాణాలో ఈ రేషన్ ఏటీఎం ఏర్పాటు చేశారు.