రూ.13 వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్.. రెడ్‌మీ 10 ప్రైమ్ వచ్చేసింది!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ మనదేశంలో రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. గతంలో లాంచ్ అయిన రెడ్‌మీ 9 ప్రైమ్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది.

ప్రధానాంశాలు:ధర రూ.12,499 నుంచి ప్రారంభంఅదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి..రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. గతంలో లాంచ్ అయిన రెడ్‌మీ 9 ప్రైమ్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో హోల్ పంచ్ డిజైన్, వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ జీ88 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

రెడ్‌మీ 10 ప్రైమ్ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499గా నిర్ణయించారు. ఫాంటం బ్లాక్, యాస్ట్రల్ వైట్, బిట్‌ఫ్రాస్ట్ వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్‌కి అప్పుడే ఆండ్రాయిడ్ 12 కూడా.. అదిరిపోయే లేటెస్ట్ ఫీచర్లు!
రెడ్‌మీ 10 ప్రైమ్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల అడాప్టివ్ సింక్ డిస్ ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. అయితే బాక్స్‌తో పాటు 22.5W చార్జర్‌ను అందించనున్నారు. 9W రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. దీని మందం 0.96 సెంటీమీటర్లు కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది.
అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 12.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Paralympicsలో ఫైనల్‌కి చేరిన ప్రమోద్ భగత్.. గెలిస్తే పసిడి పతకం

Sat Sep 4 , 2021
పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్యని ప్రమోద్ భగత్ 14కి చేర్చాడు. ఫురుషుల సింగిల్స్‌లో ఈరోజు ఫైనల్‌కి చేరిన ప్రమోద్.. కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకున్నాడు.