మరో సినిమాకు మద్దతు ఇచ్చిన ప్రభాస్.. ‘ఆకాశవాణి’ ట్రైలర్ లాంచ్ చేసి రెబల్ స్టార్

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు పెద్ద హిట్లు అవుతున్నాయి. మంచి కాన్సెప్ట్.. స్క్రిన్‌ప్లేతో వస్తున్న ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలా ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రమే ‘ఆకాశవాణి’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అయింది.

ఒకప్పుడు మాస్ సీన్లు, భారీ డైలాగ్‌లు లేదా గ్లామర్, యాక్షన్ సన్నివేశాలు ఉంటేనే సినిమాలు హిట్ అయ్యేవీ, ప్రేక్షకులు ఇలాంటి సినిమాలే చూస్తునారని.. దర్శకులు కూడా అదే మూసధోరణిలో సినిమాలు చేసేవాళ్లు. అలాంటి ఎంత మంచి కాన్సెప్ట్‌తో తీసినా ఆమె సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడేది. అలా కొందరు పెద్ద హీరోలు నటించిన సినిమాలు కూడా ఫ్లాప్‌లు అయ్యాయి. అయితే గత కొంతకాలంగా ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం మారిపోయింది. దీంతో దర్శకనిర్మాతలు కూడా తమ రూటు మార్చారు. విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేయడం ప్రారంభించారు. అలా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమా ‘ఆకాశవాణి’.

దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సముద్రఖని, వినయ్ వర్మ, తేజ, ప్రశాంత్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక కొద్దిరోజుల క్రితం ఈ సినిమా నుంచి ‘దిమ్సారే’ అనే లిరికల్‌ వీడియోకి కూడా విశేషమైన స్పందన లభించింది. గిరిజనులు చేసుకొనే జాతరలో వాళ్లు ఎలా సంబురాలు చేసుకుంటారో.. ఈ పాటలో చూపించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ బయటకు వచ్చింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ట్రైలర్‌ని లాంచ్ చేశారు.

ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా అడవిలో జీవనం సాగించే వాళ్లు ఎలా ఉంటారో ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అలా జీవిస్తున్న వాళ్లపై అక్కడ దొర చేసే అరాచకాలు.. దాడులు మనం ట్రైలర్‌లో చూడొచ్చు. అలాంటి అలాంటి గిరిజనులకు సహాయం చేసే పాత్రలో సముద్రఖని మనకు కనిపిస్తున్నారు. ట్రైలర్‌లోని లోకేషన్లు, డైలాగ్స్‌, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్ని ఆకట్టుకుంటున్నాయి. ఇక పద్మనాభ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించారు. కాలా భైరవ సినిమాకు సంగీతం సమకూర్చారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే పలు మార్లు ఈ సినిమా విడుదల వాయిదాపడింది. తాజాగా ప్రముఖ ఓటీటీ ‘సోనీ లివ్’లో ఈ సెప్టెంబర్ 24వ తేదీన ఈ సినిమా విడుదల అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

భీమ్లా నాయక్ అప్డేట్.. యాటిట్యూడ్ కా బాప్.. అదరగొట్టేసిన రానా

Mon Sep 20 , 2021
భీమ్లా నాయక్ సినిమా మీద టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. మళయాలంలో వచ్చిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్‌గా తెలుగులో భీమ్లా నాయక్ అంటూ రాబోతోంది.