రియల్‌మీ ఎక్స్9 సిరీస్ వివరాలు లీక్.. అదిరిపోయే ఫీచర్లు!

రియల్‌మీ త్వరలో లాంచ్ చేయనున్న ఎక్స్9 సిరీస్ ఫోన్లకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ ఫోన్లు ఇప్పటికే పలు సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో ఆన్‌లైన్‌లో కనిపించాయి.

ప్రధానాంశాలు:త్వరలో లాంచ్ అయ్యే అవకాశంక్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో రానున్నట్లు లీకులురియల్‌మీ ఎక్స్9 సిరీస్ చైనాకు చెందిన టెనా, 3సీ, రష్యాకు చెందిన ఈఈసీ సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో కనిపించినట్లు వార్తలు వస్తున్నాయి. RMX3361 అనే మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ ఆన్‌లైన్‌లో కనిపించింది. దీన్ని బట్టి ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ కానుందని చెప్పవచ్చు. ఈ లిస్టింగ్‌ల్లో దీని డిస్‌ప్లే సైజు, బ్యాటరీ సామర్థ్యం లీకయ్యాయి. రియల్‌మీ ఎక్స్9 ప్రో స్మార్ట్ ఫోన్ రష్యా ఈఈసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్లో RMX3381 అనే మోడల్ నంబర్‌తో కనిపించింది.

రియల్‌మీ ఎక్స్9 సిరీస్ ఫోన్లు త్వరలో లాంచ్ కానున్నట్లు గతంలో వచ్చిన లీకుల ప్రకారం తెలుస్తోంది. ఈ మోడల్ నంబర్లు ఉన్న ఫోన్లు గతంలో చాలా సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో కనిపించాయి. గిజ్మోచైనా కథనం ప్రకారం.. RMX3361 మోడల్ నంబర్‌తో రియల్‌మీ ఎక్స్9 టెనా, 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో కనిపించింది.

ఈ లిస్టింగ్ ప్రకారం.. ఇందులో 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4200 ఎంఏహెచ్‌గా ఉండనుంది. దీని పొడవు 15.92 సెంటీమీటర్లుగానూ, వెడల్పు 7.35 సెంటీమీటర్లుగానూ, మందం 0.8 సెంటీమీటర్లుగానూ ఉండనుంది.
కొత్త ఫాస్ట్ చార్జర్ లాంచ్ చేసిన ఎంఐ.. ధర ఎంతంటే?
దీంతోపాటు RMX3381 మోడల్ నంబర్ ఉన్న ఫోన్ కూడా ఆన్‌లైన్‌లో కనిపించింది. ఇది రియల్‌మీ ఎక్స్9 ప్రో అని తెలుస్తోంది. రష్యా ఈఈసీ సర్టిఫికేషన్‌లో ఈ ఫోన్ కనిపించింది. గతంలో RMX3366 అనే మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ కనిపించిందని వార్తలు వచ్చాయి. కానీ అది వేరే ఫోన్ అని చెప్పవచ్చు.

గతంలో వచ్చిన లీకుల ప్రకారం ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అందించనున్నారు. 12 జీబీ వరకు ర్యామ్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం ఇందులో ఉండనున్నాయి. రియల్‌మీ ఎక్స్9 ప్రోలో 6.55 అంగుళాల శాంసంగ్ ఈ3 సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ను అందించనున్నారు. దీంతోపాటు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్481 అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించనున్నారు.
నథింగ్ ఇయర్ 1 ధర ఇదే.. తక్కువ ధరలో సూపర్ ఫీచర్లు!
Realme X9 Pro స్పెసిఫికేషన్లుపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిపెర్ఫార్మెన్స్MediaTek Helio P95డిస్_ప్లే6.4 inches (16.26 cm)స్టోరేజ్_ఫైల్128 GBకెమెరాా108 MP + 13 MP + 13 MPబ్యాటరీ4500 mAhprice_in_india24999ర్యామ్8 GB, 8 GBపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిఇతర వేరియంట్లు Realme X9 Pro Realme X9 Pro 256GB 12GB RAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

సీఎం జగన్ మాటల్నే ఫాలో అవుతున్నా, వాళ్లే మాటతప్పి.. ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు

Mon Jul 12 , 2021
రాజధాని అమరావతిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.