రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ లాంచ్ తేదీ వచ్చేసింది.. ధర, ఫీచర్లు లీక్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన జీటీ మాస్టర్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్‌ను జులై 21వ తేదీన లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ధర, ఫీచర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

ప్రధానాంశాలు:ధర రూ.35 వేల రేంజ్‌లో..జులై 21వ తేదీన లాంచ్రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ గురించి ఇప్పటివరకు ఎన్నో లీకులు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఈ ఫోన్ ఫస్ట్‌లుక్‌ను రియల్‌మీ అధికారికంగా టీజ్ చేసింది. ఈ రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్‌ను జపనీస్ ఇండస్ట్రియల్ డిజైన్ మాస్టర్ నవోటో ఫుకసావా డిజైన్ చేశారు. ఈ ఫోన్ చైనాలో జులై 21వ తేదీన లాంచ్ కానుంది.

రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ ఫస్ట్‌లుక్
ఈ ఫస్ట్‌లుక్ ప్రకారం.. రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ సిమెంట్ గ్రే రంగులో లాంచ్ కానుంది. ఇందులో 3డీ వెగాన్ లెదర్ డిజైన్ అందించనున్నారు. రియల్‌మీ లోగోను కెమెరాకు కుడివైపు చూడవచ్చు. నవోటో ఫుకసావా గతంలో రూపొందించిన ఫోన్ల తరమా డిజైన్‌ను ఇందులో కూడా చూడవచ్చు.

రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ కంటే ముందు.. రియల్‌మీ ఎక్స్ మాస్టర్ ఎడిషన్ ఆనియన్ అండ్ గార్లిక్ వెర్షన్, రియల్‌మీ ఎక్స్2 ప్రో మాస్టర్ ఎడిషన్ కాంక్రీట్, రెడ్ బ్రిక్ వెర్షన్‌ను నవోటో ఫుకసావా డిజైన్ చేశారు.
పోకో ఎఫ్3 జీటీ ధర లీక్.. మిడ్‌రేంజ్‌లోనే అదిరిపోయే గేమింగ్ ఫోన్!
రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ గతంలో గీక్‌బెంచ్ వెబ్‌సైట్లో కనిపించింది. ఇందులో 1.8గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అందించారు. రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్‌లో 1.8 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాసెసర్‌కు కోనా అని కోడ్‌నేమ్ అందించారు. ఇది క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌కు సంబంధించిన కోడ్‌నేమ్. ఈ లిస్టింగ్ ప్రకారం.. ఇందులో 12 జీబీ ర్యామ్ ఉండనుంది. తాజాగా లాంచ్ అయిన డాక్యుమెంట్‌లో ఈ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో లాంచ్ కానున్నట్లు పేర్కొన్నారు. ఇది రియల్‌మీ జీటీ మాస్టర్ ఎక్స్‌ప్లొరేషన్ ఎడిషన్ అయ్యే అవకాశం ఉంది.

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వీబోలో తెలిపిన దాని ప్రకారం.. రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్‌తో పాటు రియల్‌మీ జీటీ మాస్టర్ ఎక్స్‌ప్లొరేషన్ ఎడిషన్‌ను కూడా కంపెనీ రూపొందిస్తుంది.

లీకైన వివరాల ప్రకారం.. ఇందులో 6.43 అంగుళాల శాంసంగ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గానూ ఉండనుంది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉండనున్నాయి.

దీంతోపాటు ఇందులో 4300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుందని తెలుస్తోంది. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. కేవలం 12 నిమిషాల్లోనే 50 శాతం, 32 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ ఈ ఫోన్ ఎక్కనుంది. దీని ధర కూడా ఆన్‌లైన్‌లో లీకైంది. ఇందులో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 399 యూరోలుగా(సుమారు రూ.35,300) ఉండగా, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 449 యూరోలుగా(సుమారు రూ.39,700) ఉండనుంది.
శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ వివరాలు లీక్.. ధర రూ.10 వేలలోపే!
Realme GT Master Edition స్పెసిఫికేషన్లుపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిపెర్ఫార్మెన్స్MediaTek MT6893 Dimensity 1200 5G (6 nm)డిస్_ప్లే6.43 inches (16.33 cm)స్టోరేజ్_ఫైల్256 GBకెమెరాా64 MP + 8 MP + 2 MPబ్యాటరీ4500 mAhprice_in_india29648ర్యామ్8 GBపూర్తి స్పెసిఫికేషన్లు చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఫలించిన వైసీపీ వ్యూహం.. ఎంపీ రఘురామకృష్ణరాజుకు షాకిచ్చిన లోక్‌సభ స్పీకర్

Fri Jul 16 , 2021
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభ స్పీకర్ షాకిచ్చారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోక్‌సభ కార్యాలయం గురువారం ఆయనకు నోటీసులు జారీచేసింది.