రియల్‌మీ బుక్ ధర లీక్.. ఫీచర్లు కూడా.. లాంచ్ త్వరలోనే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ల్యాప్‌టాప్‌ను త్వరలో లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. దీని ధర, స్పెసిఫికేషన్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

ప్రధానాంశాలు:ధర రూ.40 వేలలోపే..ఐ3, ఐ5 ప్రాసెసర్లతో లాంచ్ అయ్యే అవకాశంరియల్‌మీ బుక్ ల్యాప్‌టాప్‌ను కంపెనీ త్వరలో లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన రెండర్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీంతోపాటు ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు కూడా బయటకు వచ్చాయి. ఇంటెల్ ఐ3, ఐ5 ప్రాసెసర్లతో ఈ ల్యాప్‌టాప్ రానున్నట్లు తెలుస్తోంది. 14 అంగుళాల డిస్‌ప్లేను ఇందులో అందించనున్నారు. కనెక్టివిటీ ఆప్షన్ల వివరాలు కూడా లీకయ్యాయి. ర్యామ్, ఎస్ఎస్‌డీ వివరాలను కూడా టిప్‌స్టర్ లీక్ చేశారు. దీని ధర కూడా ఆన్‌లైన్‌లో లీకైంది.

దీని రెండర్లు, 360 డిగ్రీ వీడియోను ఆన్‌లీక్స్ అనే ఐడీ ఉన్న ప్రముఖ టిప్‌స్టర్ లీక్ చేశారు. ఈ ల్యాప్‌టాప్ సిల్వర్ ఫినిష్‌తో రానున్నట్లు ఈ రెండర్లను చూస్తే తెలుస్తుంది. ఐల్యాండ్ తరహా బ్లాక్ కీబోర్డు కూడా ఇందులో ఉండనుంది. పవర్‌బటన్ కీబోర్డు పైనే ఉండనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో అందించనున్నారు.
ఈ శాంసంగ్ ఫోన్ ధర మళ్లీ పెరిగింది.. అయినా రూ.8 వేలలోపే!
రియల్‌మీ బుక్ ధర(అంచనా)
ఈ కథనంలో ఈ ల్యాప్‌టాప్ ధర కూడా లీకైంది. దీని ధర రూ.40 వేలలోపే ఉండనుంది. ఈ ల్యాప్‌టాప్ మనదేశంలో ఆగస్టు చివరిలో లాంచ్ కానున్నట్లు సమాచారం. అయితే రియల్‌మీ దీని లాంచ్ గురించి అధికారికంగా ప్రకటించలేదు. దీంతోపాటు రియల్‌మీ ట్యాబ్లెట్ కూడా లాంచ్ కానుంది.

రియల్‌మీ బుక్ స్పెసిఫికేషన్లు(అంచనా)
ఇప్పటివరకు లీకైన స్పెసిఫికేషన్ల ప్రకారం.. ఈ ల్యాప్‌టాప్‌లో 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్ఈడీ యాంటీ గ్లేర్ డిస్‌ప్లే ఉండనుంది. దీని అంచులు సన్నగా ఉండనున్నాయి. దీని బరువు 1.5 కేజీలుగా ఉండనుంది. దీని పొడవు 30.7 సెంటీమీటర్లుగానూ, వెడల్పు 22.9 సెంటీమీటర్లుగానూ, మందం 1.6 సెంటీమీటర్లుగానూ ఉండనుంది. 11వ తరం ఇంటెల్ కోర్ ఐ3, ఐ5 ప్రాసెసర్లను ఇందులో అందించనున్నట్లు సమాచారం.

ర్యామ్, ఎస్ఎస్‌డీ ఆప్షన్లలో పలు మార్పులు ఉండనున్నాయి. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్ కూడా ఇందులో ఉండనున్నాయి. యూఎస్‌బీ టైప్-సీ, యూఎస్‌బీ టైప్-ఏ పోర్టులతో పాటు మైక్రోఫోన్, హెడ్‌ఫోన్ కాంబో జాక్ కూడా ఇందులో ఉండనున్నాయి.
7000 ఎంఏహెచ్ బ్యాటరీతో కొత్త ఫోన్.. ధర రూ.12 వేలలోపే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

TS Cabinet: ఇక ఏటా జాబ్ క్యాలెండర్, ఇక 50% రిజర్వేషన్లు వాళ్లకే.. కేబినెట్ కీలక నిర్ణయాలు

Tue Jul 13 , 2021
Telangana Cabinet: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మంత్రివర్గ సమావేశం బుధవారం (జులై 14న) కూడా కొనసాగనుంది.