తెలంగాణ రేషన్ కార్డు దారులకు షాక్.. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బంద్

నిత్యవసరాల పంపిణీని కూడా శుక్రవారం ఉదయం నుండి అధికారులు నిలిపివేశారు. ఆదివారం నుంచి తిరిగి బియ్యం ఇస్తామని పౌరసరఫరాల శాఖ పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులు రేషన్ బియ్యం పంపిణీ ఉండదని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. డాటా సెంటర్లలో సర్వర్లను ఆధునికీకరిస్తున్నందున రేషన్ ప్రక్రియకు బ్రేక్ పడింది. . దీంతో రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీ నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆదివారం నుంచి యథావిధిగా బియ్యం ఇస్తామని తెలిపారు.

హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ భవనంలోని రాష్ట్ర డేటా కేంద్రం (ఎడీసీ)లో కొత్త యూపీఎస్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆన్ లైన్ సేవలు నిలిచిపోయిన విషయం విదితమే. అదే సమయంలో సర్వర్లు పని చెయ్యక రేషన్ కార్డుదారులకు చౌకధర దుకాణాల ద్వారా నిత్యవసరాల పంపిణీని కూడా శుక్రవారం ఉదయం నుండి శనివారం వరకు నిలిపివేశారు.

ఆదివారం నుండి రేషన్ పంపిణీ ప్రక్రియ తిరిగి ప్రారంభిస్తారు. సాంకేతిక కారణాలతో అంతరాయం ఏర్పడిందని, రేషన్ లబ్దిదారులు ప్రభుత్వానికి సహకరించాలని పౌరసరఫరాల శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రతి నెల 1వ తేదీ నంచి బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటికే 10 రోజులు ఆలస్యమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

జగన్, షర్మిల మధ్య విభేదాలపై డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

Sat Jul 10 , 2021
YS Jagan Sharmila Relations వైఎస్ జయంతి రోజున తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఆయన కుమార్తె షర్మిల ఈ పార్టీని ప్రారంభించగా.. అన్నతో విభేదాలతోనే సొంత పార్టీ పెట్టిందనే ప్రచారం జరుగుతోంది.