సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రచ్చ.. తక్కువ సమయంలోనే చెర్రీ రికార్డ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండరు. అసలు రామ్ చరణ్ సోషల్ మీడియాలో చాలా లేటుగా ఎంట్రీ ఇచ్చారు. ముందుగా ఫేస్ బుక్‌లోకి వచ్చిన రామ్ చరణ్ ఆ తరువాత చాలా కాలానికి ఇన్ స్టాగ్రాంలో అడుగుపెట్టారు.

ప్రధానాంశాలు:సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రచ్చతక్కువ సమయంలోనే చెర్రీ రికార్డ్ఇన్ స్టాగ్రాంలో 4 మిలియన్ల ఫాలోవర్లుమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండరు. అసలు రామ్ చరణ్ సోషల్ మీడియాలో చాలా లేటుగా ఎంట్రీ ఇచ్చారు. ముందుగా ఫేస్ బుక్‌లోకి వచ్చిన రామ్ చరణ్ ఆ తరువాత చాలా కాలానికి (2019) ఇన్ స్టాగ్రాంలో అడుగుపెట్టారు.ఇక గత ఏడాది ఉగాదిన ట్విట్టర్ ప్రపంచంలోకి వచ్చారు. అలా మొత్తంగా రామ్ చరణ్ మూడు వేదికలపైనా సందడి చేస్తున్నారు. కానీ సమయం సందర్భం ఉంటే తప్పా రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టరు. అలాంటి రామ్ చరణ్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

తాజాగా రామ్ చరణ్ ఇన్ స్టాగ్రాం ఖాతాలో నాలుగు మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. అతి తక్కువ కాలంలోనే చెర్రీ ఈ ఫీట్‌ను అందుకున్నారు. అయితే రామ్ చరణ్ కంటే అధిక ఫాలోవర్లున్న టాలీవుడ్ హీరోల సంఖ్య చాలా ఎక్కువే. ఇన్ స్టాగ్రాం విషయానికి వస్తే విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్‌లు టాప్ ప్లేస్‌లో ఉంటారు. అలా రామ్ చరణ్‌కు తక్కువ కాలంలోనే నలభై లక్షల మంది అభిమాన గణం వచ్చి చేరారు.
Prakash Raj : రసవత్తరంగా మారనున్న ‘మా’ ఎన్నికలు.. బరిలోకి మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్!
నేటి ఉదయమే రామ్ చరణ్ ఓ పోస్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలుపెట్టబోతోన్నామని ప్రకటించారు. ఈ మేరకు తన హెయిర్ స్టైలీష్ట్ రామరాజు పాత్రకు తగ్గట్టుగా మార్చడంతో ఈ విషయాన్ని చెప్పేశారు. హెయిర్ స్టైలీష్ట్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ షూటింగ్ అప్డేట్ ఇచ్చేశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో సీన్స్ తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ షెడ్యూల్‌ను రాజమౌళి గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

చీరతో మంచు లక్ష్మి మాస్ డాన్స్.. ఒంపు సొంపుల వయ్యారాలు వడ్డిస్తూ నాభి సోయగాలు.. ట్రోల్స్ ఓ రేంజ్‌లో

Mon Jun 21 , 2021
మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యమా యాక్టివ్.. ఆమె ఏదైనా పోస్ట్ పెట్టిందంటే ఇట్టే వైరల్ అవుతుంటుంది. ఇక ట్రోలింగ్స్ కూడా అదే రేంజ్‌లో ఉన్నా.. మంచు డాటర్ మాత్రం వెనక్కి తగ్గదు. తన పని తాను చేసుకుపోతుంటుంది.