‘అవి చూడగానే ఏడ్చేశాను’.. రకుల్ నుంచి ఇది అస్సలు ఊహించుండరు!

హీరోయిన్‌లు అంటే చాలా సున్నితంగా ఉంటారు అని అంతా అనుకుంటారు. కానీ, రకుల్ ప్రీత్‌ సింగ్‌ని చూస్తే అలా అనిపించదు. చాలా సందర్భాల్లో ఆమె చాలా ధైరంగా మాట్లాడి శభాష్ అనిపించుకుంది. అయితే రీసెంట్ ఆమె ఒకటి చూసి ఏడ్చేశాను.

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కొంతకాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది. వరుస సినిమాలతో ఇక టాలీవుడ్‌లోనూ, అటు బాలీవుడ్‌లోనూ బిజీ అయిపోయింది. అదే రేంజ్‌లో సక్సెస్ కూడా సాధించింది ఈ భామ. అయితే కొంతకాలం క్రితం వరకూ వరుస ప్లాపులతో సతమతమైన రకుల్ కెరీర్ గత కొంతకాలంగా మళ్లీ పుంజుకుంది. ఇప్పుడు మళ్లీ వరుస పెట్టి సినిమాలు చేస్తుంది ఈ భామ. అందులో ప్రధానంగా చెప్పుదగ్గ సినిమాలో ‘కొండపొలం’, ‘భారతీయుడు-2’, బాలీవుడ్‌లో ‘ఎటాక్‌’, ‘మేడే’, ‘థ్యాంక్‌ గాడ్‌’,

అయితే ఇతర హీరోయిన్లతో పోలీస్తే.. రకుల్ చాలా భిన్నంగా కనిపిస్తుంది. ముఖ్యంగా జిమ్ అంటే ఈ భామకి ప్రాణం.. జిమ్ అంటే ఎంత ఇష్టమంటే తానే స్వయంగా ఓ జిమ్‌ ఫ్రాంజైజీని ప్రారంభించింది. అంతేకాదు.. రకుల్ ప్రీత్ ఎంతో ముక్కుసూటిగా ఉండే మనిషి. ఏ విషయాన్ని అయిన ఆమె డైరెక్ట్‌గా ముఖం మీదనే అనేస్తుంది. చాలా ఇంటర్వ్యూల్లో కూడా ఆమె యాంకర్లు అడిగే ప్రశ్నలకు వ్యంగ్యంతో కూడా సమాధానాలు ఇస్తూ అందరికి షాక్ ఇచ్చింది. అలాంటి రకుల్ ఓ విషయం చూసి కంటతడి పెట్టుకుందట.

అదేంటో కాదండోయ్.. చాలా రోజుల తర్వాత థియేటర్‌లో సినిమాలు చూడటం. అక్షయ్ కుమార్ హీరోగా, రంజిత్ తివారీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బెల్‌ బాటమ్’. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన రకుల్ ప్రీత్ చిత్ర యూనిట్‌తో కలిసి సినిమా చూసిందట. చాలా నెలల తర్వాత సినిమా థియేటర్‌లో చూడటంతో స్క్రీన్‌పై టైటిల్స్ చూడగానే భావోద్వేగానికి గురి అయ్యాను, ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాను అని రకుల్ ప్రీత్ పేర్కొంది. ఇలాంటి భయంకర పరిస్థితిలో సినిమాను థియేటర్‌లో విడుదల చేసిన చిత్ర యూనిట్‌కి ఆమె ధన్యవాదాలు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రూ.4 వేలలోపే ఎంఐ అదిరిపోయే స్మార్ట్ బ్యాండ్.. అందుబాటులో ఆఫర్ కూడా!

Thu Aug 26 , 2021
షియోమీ తన కొత్త స్మార్ట్ బ్యాండ్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6. దీని ధర రూ.3,499గా నిర్ణయించారు. ఆగస్టు 30వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది.