డాక్టర్‌గా మారిన యాక్టర్.. థ్రిల్లింగ్‌గా ఉందంటోన్న రకుల్

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్‌లో ఆఫర్లు లేవంటూ రకుల్ మీద వచ్చిన ఆరోపణలు ఆ మధ్య ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

ప్రధానాంశాలు:బాలీవుడ్‌లో రకుల్ హవాకుర్రహీరోతో రచ్చ రచ్చేడాక్టర్ మారిన యాక్టర్రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్‌లో ఆఫర్లు లేవంటూ రకుల్ మీద వచ్చిన ఆరోపణలు ఆ మధ్య ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తన డైరీ ఖాళీ లేదని, అప్పటికే ఆరు చిత్రాలు తన చేతిలో ఉన్నాయని, డేట్‌లను అడ్జస్ట్ చేసే వాళ్లుంటే ఎవరైనా తనను సంప్రదించండి అని మీడియా మీద రకుల్ సెటైర్లు వేశారు. అలా తన సినిమాల లిస్ట్‌లను ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. అందులో ఎక్కువగా రకుల్ బాలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తున్నారు.

రకుల్ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా ప్రాజెక్ట్‌లు చేస్తోంది. మేడే, థాంక్ గాడ్ అంటూ అజయ్ దేవగణ్ సినిమాల్లో నటిస్తోంది. అటాక్ అంటూ మరో బాలీవుడ్ మూవీ, అయలాన్ అంటూ మరొ తమిళ చిత్రంలో నటిస్తోంది. ఇక ఆయుష్మాన్ ఖురానా హీరోగా రాబోతోన్న డాక్టర్ జీ చిత్రంలో రకుల్ నటిస్తున్నారు. తాజాగా డాక్టర్ ఫాతిమా పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు.
View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet)
‘డాక్టర్ జీ సినిమా కోసం పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది.. నేను డాక్టర్ పాత్రలో కనిపిస్తున్నాను అంటే.. కచ్చితంగా ఆ మ్యానరిజం, ఆ లక్షణాలు పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఆ పాత్ర సరిగ్గా పండాలంటే మెడికల్ ప్రపంచం గురించి ఎంతో కొంత తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫాతిమా పాత్రలోకి ట్రాన్సఫర్ అవ్వడం ఎంతో నచ్చింది.. ఆ అనుభవం నాతో ఎప్పటికీ ఉంటుంది’ అని రకుల్ ఎమోషనల్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

టమాటాలు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందా..

Fri Sep 17 , 2021
ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం, జీవన విధానం సక్రమంగా ఉండాలి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి బాగుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. రోగ నిరోధక శక్తి బాగుంటే బ్యాక్టీరియా, వైరస్ ని తరిమికొట్టడానికి వీలవుతుంది.