ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు అధికారుల అలర్ట్

శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం చాలా చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

ప్రధానాంశాలు:ఆవర్తనం ప్రభావంఏపీకి వర్ష సూచననేడు, రేపు వానలుఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌ తీరానికి సమీపంలో వాయవ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ప్రభావంతో శనివారం నాటికి వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది. వాతావరణ మార్పుతో కోస్తా, రాయలసీమల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి.

ఈ ప్రభావంతో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. శనివారం విశాఖపట్నం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో, ఆదివారం విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అక్కడక్కడా భారీవర్షాలు పడవచ్చని అంచనా వేస్తున్నారు.

శుక్రవారం చాలా చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లాలో భారీవర్షం కురిసింది. ఉదయం ఎండ తీవ్ర కనిపించగా.. సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులతో భారీ వర్షం కురసింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గడిచిన 24 గంటల్లో గారలో 11.8 సెం.మీ, గుమ్మలక్ష్మీపురంలో 8.3, కళింగపట్నంలో 8.0, పాలకొండలో 7.9, ఇంకొల్లులో 7.5, శ్రీకాకుళంలో 7.0, నూజెండ్లలో 6.4, కురుపాంలో 5.8, సీతంపేట, అద్దంకి, వేటపాలెంలో 5.1, మద్దిపాడులో 5.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

సీఎం జగన్‌‌కు స్పెషల్ డే.. గవర్నర్ హరిచందన్ విషెస్, వైసీపీ అభిమానులు సైతం

Sat Aug 28 , 2021
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌- వైఎస్‌ భారతి రెడ్డిలకు 25వ వివాహ వార్షికోత్సవం. శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్.. సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు