ఇది కదా అసలైన స్మార్ట్ ఫోన్ అంటే.. సూపర్ మొబైల్ లాంచ్ చేసిన క్వాల్‌కాం!

టెక్ దిగ్గజం క్వాల్‌కాం తన కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. స్మార్ట్ ఫోన్ ఫర్ ఇన్‌సైడర్స్ అనే ప్రోగ్రాం కింద ఈ మొబైల్ లాంచ్ అయింది. ఇందులో టాప్ క్లాస్ ఫీచర్లను కంపెనీ అందించింది.

ప్రధానాంశాలు:ధర 1,499 డాలర్లుగా(సుమారు రూ.1,11,990) నిర్ణయించిన కంపెనీఆగస్టులో సేల్ ప్రారంభంస్మార్ట్‌ఫోన్ల విషయానికి వస్తే.. క్వాల్‌కాం కూడా ఒక మొబైల్ లాంచ్ చేస్తుందని ఎవరూ ఊహించరు. అయితే క్వాల్‌కాం.. అసుస్ భాగస్వామ్యంతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 144 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా విక్టస్ గ్లాస్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

క్వాల్‌కాం స్మార్ట్ ఫోన్ ధర
దీనికి సంబంధించిన సేల్ 2021 ఆగస్టులో జరగనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర 1,499 డాలర్లుగా(సుమారు రూ.1,11,990) నిర్ణయించారు. అయితే మనదేశంలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందా లేదా అన్నది తెలియరాలేదు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను కంపెనీ రూపొందించింది.

శాంసంగ్ కొత్త ఫోన్ ఫీచర్లు లీక్.. ధర బడ్జెట్‌లోనే ఉండే అవకాశం!
క్వాల్‌కాం స్మార్ట్‌‌ఫోన్ ఫీచర్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ శాంసంగ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20.4:9గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా.. 64 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్686 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 13 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్363 అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 24 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

5జీ, డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. క్వాల్‌కాం 3డీ సోనిక్ సెన్సార్ జెన్ 2 ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఇది ఫోన్ వెనకవైపు అందించారు. 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 111డీబీ డైనమిక్ రేంజ్ నాలుగు హెచ్‌డీఆర్ మైక్రోఫోన్లు కూడా ఇందులో ఉన్నాయి.
అసుస్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ లాంచ్ పక్కా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అప్పటికల్లా కేసీఆర్ ప్రభుత్వం రద్దు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Fri Jul 9 , 2021
Telangana Congress: తనపై విమర్శలు చేస్తున్న టీఆర్‌ఎస్ నాయకులకు కూడా రేవంత్‌ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను టీడీపీ నుంచి వచ్చినట్లయితే కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చారని ప్రశ్నించారు.