హైదరాబాద్‌లో అర్ధరాత్రి హైడ్రామా.. తీన్మార్ మల్లన్న అరెస్ట్

ఓ జ్యోతి‌ష్యు‌డిని బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.30 లక్షలు డిమాండ్‌ చేశారనే ఆరో‌ప‌ణ‌లపై చింత‌పండు నవీ‌న్‌‌కు‌మార్‌ అలి‌యాస్‌ తీన్మార్‌ మల్ల‌న్నను పోలీ‌సులు అరెస్ట్‌ చేయడంతో కలకలం రేగుతోంది.

ప్రధానాంశాలు:జ్యోతిషుడి ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు.మల్లన్న డబ్బు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు.రెండు రోజుల కిందట మల్లన్న ఆఫీసులో సోదాలు.‘క్యూ న్యూస్‌’ సీఈఓ తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ను పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల్‌లోని ఆయన నివాసానికి వచ్చిన చిలకలగూడ పోలీసులు.. అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. డబ్బులు ఇవ్వకపోతే తనను చంపుతానని తీన్మార్ మల్లన్న బెదిరించాడని ఆరోపిస్తూ ఓ జ్యోతిషుడు కొద్ది రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మారుతీ జ్యోతిష్యాలయ నిర్వాహకుడు సన్నిదానం లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ఈ కేసు విషయంలో తొలుత ఆగస్టు 3న చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో విచారించిన పోలీసులు.. ఆగస్టు 8 న మరోసారి విచారణకు హాజరుకావాలని మల్లన్నకు సూచించారు. అయితే, తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు పేర్కొంటూ తన లాయర్ ద్వారా సమాచారం పంపిన ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఆయనను శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్టు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ ప్రకటించారు. శనివారం ఉదయం ఆయనను కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.

తన వద్ద నుంచి రూ.30 లక్షలు డిమాండ్‌ చేస్తున్నాడని ఏప్రిల్‌ 22న జ్యోతిషుడు లక్ష్మీకాంతశర్మ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లన్న అడిగినట్టు డబ్బులు ఇవ్వకపోవడంతో తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, తనపై కక్షసాధింపుతో రాజకీయ కుట్రలో భాగంగా కేసులు పెట్టారని మల్లన్న తెలిపారు. కుట్రలో భాగంగా అరెస్టు చేశారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని మల్లన్న ప్రకటించారు. మరో కేసులో ఆయన కార్యాలయంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. సైబర్‌క్రైమ్‌ స్టేషన్‌లో రెండు, చిక్కడపల్లి, జూబ్లీహిల్స్‌లో నవీన్‌పై ఒక్కో కేసు నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పోర్న్‌ వీడియోలకు అలవాటుపడి.. సొంత తమ్ముడితోనే యువతి నీచమైన పని

Sat Aug 28 , 2021
కరోనా వైరస్ కారణంగా ఆన్‌లైన్‌కు విద్యార్థులు పరిమితం కావడంతో పలు అనర్థాలకు దారితీస్తున్నాయి. తాజాగా, మహారాష్ట్రలో ఓ బాలిక చేసిన పనికి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.