Allu Arjun: పుష్పరాజ్ హవా మామూలుగా లేదే.. ఇలా అయితే రికార్డులు తిరగరాయడం ఖాయమే..

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న 'పుష్ప' మూవీ విడుదలకు ముందే పలు రికార్డ్స్ చెరిపేసే దిశగా అడుగులేస్తోంది. ఇటీవలే విడుదలైన పుష్పరాజ్ ఇంట్రొడ్యూసింగ్ వీడియో నెట్టింట హంగామా చేస్తోంది.

ప్రధానాంశాలు:మరోసారి అల్లు అర్జున్- సుకుమార్ కాంబో రిపీట్'పుష్ప' అనే టైటిల్‌తో భారీ సినిమావిడుదలకు ముందే పుష్పరాజ్ రికార్డ్స్టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప రాజ్'గా జెట్ స్పీడులో దూసుకుపోతున్నారు. మాస్ లుక్‌లో ప్రేక్షకలోకాన్ని తెగ అట్రాక్ట్ చేస్తూ రికార్డుల సునామీ సృష్టిస్తున్నారు. అదేనండీ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న 'పుష్ప' మూవీ విడుదలకు ముందే పలు రికార్డ్స్ చెరిపేసే దిశగా అడుగులేస్తోంది. ఈ సినిమా నుంచి ఇటీవలే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా.. పుష్ప రాజ్ రోల్‌ని పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్ అద్భుతమైన స్పందన తెచ్చుకుంటోంది. విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో దూసుకుపోతూ తాజాగా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

తెలుగు ఇండస్ట్రీలో అత్యంత వేగంగా 50 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్న తొలి టీజర్‌గా అల్లు అర్జున్ పుష్పరాజ్ వీడియో రికార్డు సృష్టించింది. అంతేగాక 1.2 మిల్లియన్ లైకులతో పాటు లక్ష కామెంట్స్ కూడా ఈ టీజర్‌కు రావడం గమనార్హం. టీజర్‌లో దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్ అన్నట్లుగా ఉంది. దీంతో బన్నీ స్పీడు చూసి ఇప్పుడే ఇలా ఉంటే ఇక 'పుష్ప' విడుదల తర్వాత గత రికార్డులు తిరగరాయడం ఖాయమే అంటున్నారు ఆడియన్స్.
శ్రీ రెడ్డి ఒడిలో పవన్ కళ్యాణ్.. నా బిగ్ చెస్ట్ కారణంగానే ఆయన సేఫ్! బోల్డ్ కామెంట్స్‌తో దుమారం
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ రేంజ్‌లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు సుకుమార్. చిత్రంలో అల్లు అర్జున్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. గిరిజన యువతిగా ఆమె అప్పీయరెన్స్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానుందని టాక్. అనసూయ కీలకపాత్ర పోషిస్తోంది. లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటిస్తుండగా.. ఆయన చెల్లెలి పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తోందని సమాచారం. ఈ మూవీపై బన్నీ ఫ్యాన్స్‌ మాటల్లో చెప్పలేని అంచనాలు పెట్టుకున్నారు.
Pushpa: పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే లే అని చింపేశాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాను.. కీలక ప్రకటన చేసిన ఆలియా భట్

Tue Apr 27 , 2021
కరోనా కారణంగా దేశం మరోసారి తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయింది. సరైన వైద్య సౌకర్యాలు లేక ప్రతీ రోజు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు సహాయం అందించేందుకు పలువురు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. తాజాగా నటి ఆలియా భట్ తాను కష్టాల్లో ఉన్నవారికి సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది.