ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ బ్యాంక్‌లో అకౌంట్ తెరిస్తే రూ.3 లక్షలు!

మీరు శాలరీ అకౌంట్ తెరవాలని భావిస్తున్నారా? అయితే మీకు పీఎన్‌బీ ఒక ఆఫర్ అందిస్తోంది. శాలరీ అకౌంట్ తెరిస్తే రూ.3 లక్షల వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ పొందొచ్చు. ఇంచా ఉచిత ప్రమాద బీమా లభిస్తుంది.

ప్రధానాంశాలు:ఈ బ్యాంక్‌లో ఖాతా ఉన్న వారికి ప్రత్యేక ఫెసిలిటీశాలరీ అకౌంట్ ఉంటే ఓవర్ డ్రాఫ్ట్రూ.3 లక్షల వరకు పొందొచ్చుదేశీ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB ప్రత్యేకమైన సదుపాయం కల్పిస్తోంది. వేతనజీవులకు రూ.3 లక్షల అందిస్తోంది. అయితే ఇక్కడ షరతు ఉంది. బ్యాంక్‌లో శాలరీ అకౌంట్ కలిగిన వారికే ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. లేదంటే లేదు.

మీరు పీఎన్‌బీ మైశాలరీ అకౌంట్ కలిగి ఉంటే.. మీరు ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ కింద రూ.3 లక్షల వరకు పొందొచ్చు. అయితే మీ అకౌంట్ రకం ప్రాతిపదికన మీరు పొందే బెనిఫిట్ కూడా మారుతుంది. ప్రస్తుతం శాలరీ అకౌంట్లలో సిల్వర్, గోల్డ్, ప్రీమియం, ప్లాటినం అనే రకాలు ఉన్నాయి.

Also Read: రూ.లక్ష పెడితే సంవత్సరానికే చేతికి రూ.37 లక్షలు.. భారీ లాభం!

సిల్వర్ రకం శాలరీ అకౌంట్ కలిగిన వారు రూ.50 వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ పొందొచ్చు. గోల్డ్ రకం శాలరీ ఖాతా అయితే రూ.1.5 లక్షల వరకు, ప్రీమియం అయితే రూ.2.24 లక్షల వరకు, ప్లాటినం రకం శాలరీ అకౌంట్ అయితే రూ.3 లక్షల వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ లభిస్తుంది.

ఇకపోతే వేతన ఖాతా కలిగిన వారికి ఉచిత ఇన్సూరెన్స్ బెనిఫిట్ కూడా ఉంది. రూ.20 లక్షల వరకు బీమా పొందొచ్చు. ఇది పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్. ఇకపోతే శాలరీ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిన పని లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రాజ్‌భవన్‌లో కేరళ గవర్నర్ నిరాహార దీక్ష.. ఓ మంచి పనికోసం!

Thu Jul 15 , 2021
అక్షరాాస్యత, ఆయుఃప్రమాణం వంటి సామాజిక అంశాలలో ప్రశంసలందుకుంటోంది కేరళ.. అటువంటి చోట వరకట్న వేధింపులు, మహిళల పట్ట అఘాయిత్యాలు ఆ రాష్ట్రాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి