పెళ్లికి 100 మంది అతిథులు.. కటకటాల్లో వరుడు.. కారణం విని షాకైన పోలీసులు

కోరనా నిబంధనలు పాటించకుండా పెళ్లి చేసుకున్న వరుడిని పంజాబ్‌లోని జలంధర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి, రిసెప్షన్ కార్యక్రమానికి 100 మందికి పైగా హాజరు కావడంతోనే పోలీసులు వారికి షాకిచ్చారు.

ప్రధానాంశాలు:పంజాబ్‌లో పెళ్లికొడుకు అరెస్ట్వివాహానికి 100 మంది అతిథుల హాజరుకోవిడ్ నిబంధనల అతిక్రమించినందుకు పోలీసులు షాక్దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు 50 మందికి మించి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన ఓ యువకుడిని పెళ్లి జరిగిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. జలంధర్‌లోని ఓ ఆలయంలో పెళ్లి, ఆ వెంటనే రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు 100 మందికి పైగా బంధువులు హాజరయ్యారు. ఏ ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించుకుండా ఇష్టారీతిగా వ్యవహరించారు.

ఈ విషయాన్ని ఎవరో పోలీసులకు చేరవేయడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వరుడితో పాటు అతడి తండ్రిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల రాకతో అతిథులు తలోదిక్కుగా పారిపోయారు. అయితే పెళ్లికి తాము 50 మంది కంటే తక్కువగానే ఆహ్వానించామని, వేడుకకు వచ్చిన వారిలో చాలామంది తమకు బంధువులు, స్నేహితులు కాదని వరుడు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. పెళ్లికి వచ్చిన వారిని వెళ్లిపొమ్మని చెబితే బాగుండదన్న ఉద్దేశంతోనే తాము మౌనంగా ఉన్నామని చెప్పాడు. అయినప్పటికీ కోవిడ్ నిబంధనలు పాటించని నేరానికి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా జలందర్‌ డిప్యూటీ కమిషనర్‌ మాట్లాడుతూ.. ‘ వరుడు, అతడి కుటుంబ సభ్యులు వారాంతపు కర్ఫ్యూని ఉల్లంఘించారు. వేడుక నిర్వహించడానికి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అందుకే వారి మీద ఐపీసీ సెక్షన్‌ 188 కింద కేసు నమోదు చేశాం’ అని తెలిపారు. కరోనా కట్టడి కోసం పంజాబ్‌ ప్రభుత్వం వీకెండ్ కర్ఫ్యూ విధిస్తోంది. దీంతో పాటు జిమ్‌లు, సినిమా హాళ్లు, పార్కులు, కోచింగ్‌ సెంటర్లు, క్రీడా సముదాయాలు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. వివాహాలు, అంత్యక్రియలకు 20 మందికి, అంత్యక్రియలకు కేవలం 10మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

108 మెగాపిక్సెల్ కెమెరా, 5జీతో రానున్న నోకియా కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?

Mon Apr 26 , 2021
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా త్వరలో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 5జీ ఫీచర్ కూడా ఉండనుందని సమాచారం. దీని పేరు నోకియా ఎక్స్50 అని కథనాలు వస్తున్నాయి.