ఆన్‌లైన్‌లో నటి ప్రైవేటు వీడియో లీక్.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియాంక

సినిమా హీరోయిన్‌లకు సంబంధించి వీడియోలు లీక్‌ కావడం ఎప్పటి నుంచో జరుగుతున్న విషయమే. తాజాగా ప్రియాంక పండిట్ అనే హీరోయిన్‌కి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఆన్‌లైన్‌లో ఆమెకు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో లీక్ అయింది.

ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత సినిమా హీరోయిన్లపై అనవసర ట్రోల్స్ చేయడం.. వాళ్ల ఫోటలను ఫేక్ చేయడం.. అసభ్యకనరమైన కామెంట్స్ చేయడం, ఇక వాళ్లకు సంబంధించిన ప్రైవేటు వీడియోలు లీక్‌ కావడం పెరిగిపోయింది. తాజాగా భోజ్‌పూరి నటి ప్రియాంక పండిట్‌కి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రైవేటు వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై తాజాగా ప్రియాంక తాజాగా స్పందించింది. తన వీడియోపై లీక్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో నివాసం ఉంటున్న ప్రియాంక.. ‘పవన్‌ పుత్ర’, ‘ఇచ్ఛదాన్’, ‘ఆవారా బలామ్’, ‘కరమ్ యుగ్’, ‘థోడ్ దే దుష్మన్‌కి నాలీ రామ్ ఔర్ అలీ’ వంటి సినిమాల్లో నటించింది. తనపై ఎవరో కుట్రపూరితంగానే ఈ వీడియో లీక్‌కి పాల్పడ్డారు అంటూ ఆమె కామెంట్ చేసింది. వ్యక్తిగతంగా తనపై ద్వేషం ఉన్న వాళ్లే ఈ పని చేశారు అని ఆమె మండిపడింది. అంతేకాదు.. అసలు ఆ వీడియోలో ఉంది తాను కానే, కాదు అని.. తనలా పోలి ఉండే మరో అమ్మాయి అంటూ ప్రియాంక తెలిపింది.

ఇక ఈ పనికి పాల్పడిన వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశాను అని.. వాళ్లపై కఠిన చర్యలు తీసుకొనే వరకూ పోరాడుతాను అంటూ ఆమె స్పష్టం చేసింది. ఇక భోజ్‌పురి సినిమాలతో పాటు.. ‘దిల్ మత్ దేనా మేరీ సాతోంకో’, రాజూ సింగ్ ‘పోలీస్‌గిరి’, మరియు ఫ్యామిలీ డ్రామా ‘పంచ్ మెహరియా’ సినిమాలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ప్రియాంక కేసును స్వీకరించిన పోలీసులు దానిపై విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

తల్లి అయిన వివాదాస్పద ఎంపీ నుస్రత్.. మాజీ భర్త కామెంట్స్ తెలిస్తే షాక్ అవుతారు!

Thu Aug 26 , 2021
టీఎంసీ ఎంపీ, అందాల తార నుస్రత్ జహాన్ తన జీవితంలో మరో ముందడుగు ముందుకు వేసింది. కొద్ది రోజుల క్రితం తన భర్తకి దూరం అయిన ఆమె.. తాజాగా బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్నేహితుడు వెల్లడించారు.