ఆమెను బాగా మిస్ అవుతున్నానంటూ ప్రియాంక భర్త కామెంట్స్.. రొమాంటిక్ ఫొటోతో ఫీలింగ్స్ బయటపెట్టిన నిక్

ప్రియాంక- నిక్ రొమాంటిక్ ముచ్చట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే కొద్ది రోజులుగా ఈ జంట ఒకరికొకరు దూరంగా ఉంటున్నారట. మరి ఆ సంగతులేంటో చూద్దామా..

ప్రధానాంశాలు:రొమాంటిక్ కపుల్ ప్రియాంక- నిక్వీలు చిక్కినప్పుడల్లా అదే రిపీట్తన ఫీలింగ్స్ ఇవీ అంటున్న నిక్అదేంటి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా భర్తకు దూరంగా ఉంటోందా? అనుకుంటున్నారు కదూ!. దూరంగా ఉండటమనేది నిజమే గానీ పర్మినెంట్ మాత్రం కాదు. గత కొద్దిరోజులుగా తన షూటింగ్ నిమిత్తం భర్త నిక్‌కి దూరమైంది ప్రియాంక చోప్రా. ఈ నేపథ్యంలో తాజాగా తన భార్యతో దిగిన ఓ రొమాంటిక్ ఫొటో షేర్ చేస్తూ అంతకన్నా రొమాంటిక్ కామెంట్ పెట్టాడు ప్రియాంక భర్త నిక్ జోనాస్.

తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌‌ని ప్రేమించి పెళ్లాడిన ప్రియాంక చోప్రా.. అతనితో చెట్టాపట్టేసుకు తిరగడం, పబ్లిక్ రొమాన్స్ చేస్తూ వార్తల్లో నిలవడం కామన్‌గా చూస్తున్నాం. ఏ మాత్రం సమయం దొరికినా ఈ ఇద్దరూ రొమాంటిక్ మూడ్‌లో తేలిపోతుంటారు. పబ్లిక్ గానే రొమాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుండటం ఈ జోడీ హాబీ. కెరీర్ పరంగా ఎంత బిజీ అయినా తన ప్రియుడు, భర్త నిక్ జోనాస్‌తో రొమాంటిక్ మూమెంట్స్ ఎంజాయ్ చేయడంలో మాత్రం ఎప్పుడూ ముందుంటుంది ప్రియాంక. అలాంటిది ఓ టీవీ షో కోసం కొన్ని రోజులుగా లండ‌న్‌లో ఉంటోంది ప్రియాంక చోప్రా.
బ్లాకీ అన్నారు.. అలా చూసి ఆంటీ అంటూ రెచ్చిపోయారు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన ప్రియమణి
అయితే తన భార్యతో ఏర్పడ్డ ఈ దూరాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తన ఫీలింగ్స్ బయటపెట్టారు నిక్ జోనాస్. చాలా రోజులుగా ప్రియాంక‌కు దూరంగా ఉంటున్న ఆయన.. ఆమెను బాగా మిస్ అవుతున్నట్లు పేర్కొంటూ తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఈ మేరకు గతంలో ప్రియాంకతో కలిసి దిగిన ఓ రొమాంటిక్ పిక్ షేర్ చేశారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్లూ సారీలో ప్రియాంకను ఇలా రొమాంటిక్ మూడ్‌లో చూసి వావ్! బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
View this post on Instagram A post shared by NICK JONɅS (@nickjonas) ప్రియాంకను తలచుకుంటూ నిక్ ఫీలింగ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రక్తదానం చేస్తే కాన్సర్ రాదా..

Mon Jun 14 , 2021
ఎన్నోసార్లు ఆసుపత్రిలో రక్తం లేక ఇబ్బంది పడే పేషెంట్స్ ని మనం చూసే ఉంటాం. అటువంటి వాళ్ళకి కాస్త రక్తం ఇస్తే వాళ్ళ జీవితాన్ని సేవ్ చేయవచ్చు. అయితే ఇలా రక్త దానం చేయడం వల్ల మనకి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. మరి వాటి కోసం ఈరోజు మనం తెలుసుకుందాం.