టీచర్‌పై కన్నేసిన ప్రిన్సిపాల్.. ఫోన్‌కి పోర్న్ మెసేజ్‌లు పంపించి వేధింపులు

టీచర్‌ ఫోన్‌కి పోర్న్ మెసేజ్‌లు పంపించాడు. ఆమె గర్భంతో ఉన్నాను.. రాలేనని చెప్పినా తక్షణం తన స్కూల్‌లో విధుల్లో చేరాలని నోటీసులు పంపించాడు. చివరికి కటకటాలపాలయ్యాడు.

విద్యాబుద్ధులు నేర్పించాల్సి గురువే దారితప్పాడు. తన సహోద్యోగిపై కామవాంఛలతో రెచ్చిపోయాడు. గర్భిణి అనే కనీస కనికరం లేకుండా నీచంగా ప్రవర్తించాడు. ఫోన్‌కి అసభ్యకర మెసేజ్‌లు పంపించి లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. కొద్దికాలం మౌనంగా భరించిన టీచర్ చివరికి ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ప్రిన్సిపాల్ కీచకపర్వం బయటపడింది. రాజస్థాన్ జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు..

భినాయ్ పరిధిలోని ఎకల్సింఘా సెకండరీ స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయినిపై స్కూల్ ప్రిన్సిపాల్ కన్నేశాడు. ఆమెపై లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఐదు నెలల కిందట ఆమె సీనియర్ సెకండరీ స్కూల్‌కి బదిలీపై వచ్చింది. అప్పటికే తన స్కూల్‌లో పనిచేస్తున్న మరో టీచర్‌ని బదిలీ చేయించి ఆమెను ఇక్కడ విధుల్లో చేరాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాడు. తాను గర్భంతో ఉన్నానని.. అక్కడికి రాలేనని చెప్పిన తక్షణం విధుల్లో చేరాల్సిందేనని నోటీసులు పంపించాడు.

గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె అదే స్కూల్‌లో విధుల్లో చేరింది. అప్పటికే ఆమెపై కన్నేసిన ప్రిన్సిపాల్ ఆమె ఫోన్‌కి పోర్న్ మెసేజ్‌లు పంపించాడు. విషయం బయటికి చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరింపులకు దిగడంతో భయపడిన టీచర్ మౌనంగా ఉండిపోయింది. రోజురోజుకీ వేధింపులు ఎక్కువవుతుండడంతో ఉద్యోగం మానేసేందుకు కూడా సిద్ధమైన ఉపాధ్యాయిని పోలీసులను ఆశ్రయించింది. ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కీచక ప్రిన్సిపాల్‌ని అరెస్టు చేసి జైలుకి పంపించారు.

Also Read: గుంటూరు: కృష్ణా కరకట్టపై ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఏపీ ప్రజలకు అలర్ట్: ప్రభుత్వ ఆఫీసుల్లో టైమింగ్స్‌ మారాయ్.. వివరాలివే!

Sun Jun 20 , 2021
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు పడిపోతున్న తరుణంలో సోమవారం నుంచి టైమింగ్స్ మారిపోనున్నాయి.