అది చాలా ఇబ్బందిగా ఉండేది.. అలాంటి సీన్లు చేస్తే ఒప్పుకొనే వాళ్లు కాదు: ప్రీతి జింగానియా

కొంతమంది హీరోయిన్లు ఎక్కువ సినిమాలు చేయకున్న ప్రేక్షకుల మదిలో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. అలా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న నటి ప్రీతి జింగానియా.. బాలీవుడ్‌తో పాటు.. పలు తెలుగు సినిమాల్లో కూడా నటించి ఆమె ప్రేక్షకులను అలరించింది.

సినిమా తారలకు.. అభిమానులకు మధ్య ఉండే సంబంధం మామూలుది కాదు. తమ అభిమాన నటుడు, లేదా నటి సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ చేసే కోలాహలం మామూలుగా ఉండదు. థియేటర్ల వద్ద కటౌట్లు పెట్టి.. టపాసులు కాలుస్తూ నానా హంగామా చేస్తుంటారు. కొన్ని సందర్భంగా తమ అభిమానులకు ఇలా చేస్తే నచ్చదు అంటూ స్క్రిప్ట్‌ని హీరోలే మార్చేసే పరిస్థితి కూడా వస్తుంది. ఇక హీరోయిన్ల విషయంలో ఈ పరిస్థితి మరోలా ఉంటుంది.

ఒకవేళ తమ అభిమాన హీరోయిన్ కురచ దుస్తులు ధరించినా.. లేదా బోల్డ్ సీన్లలో నటించిన వాళ్లు ఆమెని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇంకోసారి అలాంటి సీన్లలో నటించవద్ద అంటూ ఆమెకి సందేశాలు పంపుతారు. బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింగానియాకు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రీతి జింగానియా అంటే మనకి ఆమె నటించిన ‘తమ్ముడు’, ‘నరసింహనాయుడు’ వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. బాలీవుడ్‌ నుంచి వచ్చిన హీరోయిన్ అయినప్పటికీ.. తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది ఈ ముద్దుగుమ్మ.

నటుడు పర్విన్ దాబాస్ తో పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పిన ఆమె.. ప్రస్తుతం నిర్మాతగా మారి ఓటీటీకి చిత్రాల్ని నిర్మిస్తోంది. అయితే అభిమానుల నుంచి తనకు చాలా ఇబ్బందులు ఎదురు అయ్యాయి అంటూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ భామ వెల్లడించింది. తమ ఇంట్లో మనిషిగా ఆమెను భావించి.. ఒకవేళ ముద్దు సీన్లలో నటిస్తే.. దానిపై ఫ్యాన్స్ చాలా అభ్యంతరం చెప్పేవాళ్లు అని ఆమె పేర్కొంది. అది చాలా ఇబ్బందిగా ఉండేది అని కూడా ఆమె స్పష్టం చేసింది. సినిమా కెరీర్ అంటేనే అన్ని రకాల పాత్రలు చేయాలి అని.. కానీ, ఇలా తనపై ఒత్తిడి చేయడం ఎంతో బాధ కలిగించింది అంటూ ఆమె తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఉదయాన్నే ఈ నూనెతో తలపై మసాజ్ చేస్తే చాలా మంచిదట..

Mon Aug 23 , 2021
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. కావున ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తున్నారు. ఆయుర్వేదం వలన ఆరోగ్యమైన జీవితాన్ని కొనసాగించడం సాధ్యమవుతుందని అనేక మంది నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే ఆయుర్వేదం అనేది ఓ పెద్ద గ్రంథం కావున ఎటువంటి చిట్కాలు పాటించాలో తెలియక చాలా మంది తికమక పడుతుంటారు.