పారాలింపిక్స్‌లో భారత్‌కి రజత పతకం.. 18 ఏళ్ల ప్రవీణ్ సంచలనం

పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య 11కి చేరింది. హై జంప్‌లో 18 ఏళ్ల ప్రవీణ్ కుమార్ శుక్రవారం రజత పతకాన్ని భారత్‌కి అందించాడు. పారా ఒలింపిక్స్‌లో ప్రవీణ్ పోటీపడటం ఇదే తొలిసారి.

ప్రధానాంశాలు:పారాలింపిక్స్‌లో భారత్‌కి రజత పతకంహై జంప్‌లో పతకం గెలిచిన ప్రవీణ్ కుమార్పారాలింపిక్స్‌లో ప్రవీణ్ పోటీపడటం ఇదే తొలిసారి11కి చేరిన భారత్ పతకాల సంఖ్యటోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కి మరో రజత పతకం దక్కింది. ఫురుషుల T64 హై జంప్ ఈవెంట్‌లో శుక్రవారం పోటీపడిన ప్రవీణ్ కుమార్ 2.07మీ జంప్‌తో కాంస్య పతకాన్ని గెలుపొందాడు. పారాలింపిక్స్‌లో ప్రవీణ్ కుమార్ పోటీపడటం ఇదే తొలిసారికాగా.. గ్రేట్ బ్రిటన్‌కి చెందిన బ్రూమ్ ఎడ్వర్డ్స్‌ 2.10మీ జంప్‌‌తో పసిడి పతకాన్ని గెలుపొందాడు. నోయిడాకి చెందిన 18 ఏళ్ల ప్రవీణ్ కుమార్‌కి కెరీర్‌లో ఇదే (2.07) అత్యుత్తమ ప్రదర్శన. అలానే భారత్ బృందంలో పతకం గెలిచిన పిన్న వయస్కుడిగా ప్రవీణ్ నిలిచాడు.

2019లో కెరీర్ ప్రారంభించిన ప్రవీణ్ కుమార్.. ఆ ఏడాది జూనియర్ పారా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని గెలుపొందాడు. ప్రస్తుతం T44 క్లాసిఫికేషన్‌లో వరల్డ్ నెం.3 ర్యాంక్‌లో ఉన్న ప్రవీణ్ కుమార్.. T64‌లో పోటీపడి పతకం గెలవడం విశేషం. మొత్తంగా పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 11కి చేరింది. ఇందులో రెండు స్వర్ణ పతకాలు, ఆరు రజతాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Avani Lekhara‌ అరుదైన ఘనత.. పారాలింపిక్స్‌లో షూటర్‌కి రెండో పతకం

Fri Sep 3 , 2021
పారాలింపిక్స్‌లో భారత షూటర్ అవని సరికొత్త చరిత్ర సృష్టించింది. నాలుగు రోజుల క్రితం గోల్డ్ మెడల్ గెలిచిన అవని.. ఈరోజు కాంస్య పతకంతో అరుదైన ఘనత సాధించింది.