పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్.. రూ.150 పొదుపుతో చేతికి రూ.24 లక్షలు!

మీరు పోస్టాఫీస్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం ఒక స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పీపీఎఫ్. మీరు ఈ స్కీమ్‌లో చేరితే రూ.240 లక్షలు పొందొచ్చు. దీని కోసం రోజుకు రూ.150 ఆదా చేయాలి.

ప్రధానాంశాలు:పోస్టాఫీస్ అదిరే స్కీమ్రూ.150 పొదుపుచేతికి రూ.24 లక్షలుచిన్న మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఇలా దీర్ఘకాలంలో కళ్లుచెదిరే రాబడి సొంతం చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం పోస్టాఫీస్‌లో అదిరిపోయే స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవ్వన్నీ స్మాల్ సేవింగ్ స్కీమ్స్.

వీటిల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF కూడా ఒకటి. మీరు పీపీఎఫ్ స్కీమ్‌లో డబ్బులు పెడితే మంచి రాబడి పొందొచ్చు. అంతేకాకుండా ట్యాక్స్ కూడా కట్టాల్సిన పని లేదు. పీపీఎఫ్ స్కీమ్‌లో వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారొచ్చు. కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది.

Also Read: బైక్ కొనే వారికి భారీ ఆఫర్.. ఏకంగా రూ.28 వేల తగ్గింపు!

పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. అంటే మీరు 15 ఏళ్ల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. మీకు ఇంకా మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకోవచ్చు. ఐదేళ్ల చొప్పున మెచ్యూరిటీ కాలాన్ని పెంచుకోవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతాపై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది.

మీరు రోజుకు రూ.150 ఆదా చేసి నెల చివరిలో రూ.4,500 మొత్తాన్ని పీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేయాలి. అంటే మీరు సంవత్సరానికి రూ.54 వేలు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అవుతుంది. ఇలా మీరు 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి. అంటే రూ.10.8 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుంది. అయితే మీకు రూ.24 లక్షలు వస్తాయి. మీరు గరిష్టంగా ఏడాదిలో రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.

Also Read: బంగారం కొనే వారికి అదిరిపోయే శుభవార్త.. భారీగా దిగొచ్చిన రేట్లు.. వెండిదీ ఇదే దారి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Telangana Lockdown ఎత్తివేత.. కేబినెట్ కీలక నిర్ణయం

Sat Jun 19 , 2021
TS Cabinet: వైద్యశాఖ అధికారులు ప్రతిపాదన మేరకు లాక్ డౌన్‌ను ఎత్తి వేయాలని నిర్ణయించారు. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.