రూ.5 లక్షలు పెడితే.. రూ.10 లక్షలు ఇస్తున్న పోస్టాఫీస్.. రిస్క్ లేకుండా కచ్చితమైన రాబడి!

మీరు డబ్బులు రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకోసం ఒక స్కీమ్ ఉంది. అదే కిసాన్ వికాస్ పత్ర. ఇందులో డబ్బులు పెడితే కచ్చితంగా రెట్టింపు అవుతాయి. రిస్క్ లేకుండా రాబడి పొందొచ్చు.

ప్రధానాంశాలు:అదిరే స్కీమ్కచ్చితమైన లాభంనో రిస్క్పోస్టాఫీస్‌లో ఎన్నో రకాల స్కీమ్స్ ఉన్నాయి. వీటిల్లో డబ్బులు పెడితే కచ్చితమైన రాబడి పొందొచ్చు. అలాగే రిస్క్ కూడా ఉండదు. అంటే మీరు పెట్టిన డబ్బులకు ప్రమాదం ఉండదని చెప్పుకోవచ్చు. అదే బ్యాంకుల్లో డబ్బులు పెడితే రూ.5 లక్షల వరకే హామీ ఉంటుంది.

పోస్టాఫీస్ అందిస్తున్న స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో కిసాన్ వికాస్ పత్ర KVP కూడా ఒకటి. కేవీపీ స్కీమ్‌లో డబ్బులు పెడితే రెట్టింపు రాబడి పొందొచ్చు. అంటే మీరు పెట్టిన డబ్బు డబుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. కేవీపీ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 124 నెలలు.

కిసాన్ వికాస్ పత్ర పథకంలో చేరాలంటే కనీసం రూ.1000 ఉంటే సరిపోతుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఎంత డబ్బు అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. 124 నెలల్లో డబ్బు రెట్టింపు అవుతుంది. అంటే రూ.5 లక్షలు పెడితే.. రూ.10 లక్షలు అవుతుంది. పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చు.

Also Read: కొత్తగా కారు కొనే వారికి శుభవార్త.. రూ.2 లక్షల భారీ తగ్గింపు!

Also Read: ఈ 170 యాప్స్‌తో జాగ్రత్త.. లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Babar Azam రికార్డ్ శతకం.. అయినా పాక్‌కి తప్పని క్లీన్‌స్వీప్

Wed Jul 14 , 2021
పాకిస్థాన్‌ని క్లీన్‌స్వీప్ నుంచి తప్పించేందుకు కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డు శతకం బాదేశాడు. కానీ.. బౌలింగ్‌లో విఫలమైన పాక్ టీమ్ జేమ్స్ విన్స్ దెబ్బకి ఓడిపోయింది.