పోస్టాఫీస్ అందించే ఈ స్కీమ్‌లో చేరితే.. సులభంగానే రుణం!

మీరు పోస్టాఫీస్ స్కీమ్‌లో చేరాలని భావిస్తున్నారా? అయితే రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటుంది. ఇందులో చిన్న మొత్తంలోనే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందొచ్చు. అలాగే లోన్ ఫెసిలిటీ కూడా ఉంది.

ప్రధానాంశాలు:పోస్టాఫీస్ స్కీమ్‌తో రుణంసగం మొత్తంపై లోన్వడ్డీ రేటు ఎంతంటే..పోస్టాఫీస్ ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. వీటిల్లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు కట్టలేని వారు ప్రతి నెలా చిన్న మొత్తంలోనే డబ్బులు కట్టుకుంటూ దీర్ఘకాలంలో మంచి రాబడి పొందటానికి ఈ స్కీమ్ అనువుగా ఉంటుంది.

రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరిన వారు సులభంగానే లోన్ కూడా పొందొచ్చు. అయితే ఏడాది పాటు ప్రతి నెలా నెలా డబ్బులు చెల్లిస్తూ వచ్చి ఉండాలి. లేదంటే ఈ స్కీమ్ కింద లోన్ పొందడం సాధ్యం కాదు. అలాగే మీరు ఎంత లోన్ పొందొచ్చనే విషయం మీరు చెల్లించే మొత్తం ప్రాతిపదికన మారుతుంది.

మీ రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో అందులో సగం మొత్తాన్ని లోన్ కింద పొందొచ్చు. తీసుకున్న రుణాన్ని ఇన్‌స్టాల్‌మెంట్లలో లేదా ఒకేసారి తిరిగి చెల్లించొచ్చు. మీరు పోస్టాఫీస్‌కు వెళ్లి మీ రికరింగ్ డిపాజిట్ పాస్‌బుక్‌తోపాటు అప్లికేషన్ జతచేసి సమర్పించాలి. ఈ రుణాలపై వడ్డీ రేటు ఆర్‌డీ వడ్డీ రేటు కన్నా 2 శాతం ఎక్కువగా ఉంటుంది. అంటే లోన్‌పై రుణ రేటు 7.8 శాతం పడుతుంది.

Also Read: రూ.300తో మీరే ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకోండి.. 15 నిమిషాల్లో కరోనా ఉందో లేదో తెలుసుకోండి!

Also Read: కొత్తగా బైక్ కొనాలనుకునే వారికి శుభవార్త.. రూ.25 వేల భారీ తగ్గింపు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పంజాబ్ పీసీసీ చీఫ్‌గా మాజీ క్రికెటర్.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రక్షాళన!

Thu Jul 15 , 2021
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో తిరిగి అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేకున్నా.. సొంత పార్టీలో అసమ్మతి ఇబ్బందిగా పరిణమించింది.