‘అసలు అందులో ఏమైనా లాజిక్ ఉందా..?’ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డ పూజా

భయంకరంగా వ్యాపిస్తున్న కరోనా బారిపడి ప్రాణాలు కోల్పోవద్దు అంటే వ్యాక్సిన్ తీసుకోవడమే మార్గమని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతుంది. ఈ క్రమంలో ఉచిత వ్యాక్సిన్ కూడా అందిస్తున్నాయి. అయితే నటి పూజా బెడీ మాత్రం వ్యాక్సినేషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్‌లో విలయతాండవం చేసింది. కొన్ని నెలల క్రితం ప్రతీ రోజు దాదాపు 4 లక్షలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలను ఖననం చేసేందుకు స్మశానవాటికల్లో చోటు దొరకని భయంకర పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ విధించింది. పటిష్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేయడంతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది. గత కొన్ని రోజులుగా చాలా తక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి.

మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా సాగుతోంది. ఇప్పటి వరకూ దాదాపు 55 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చాము అంటే కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు కూడా కరోనా బారీనపడటం భయాందోళనకు గురి చేస్తోంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నా.. కరోనా సోకే అవకాశాలు ఉన్నాయి కానీ, ప్రాణాలు పోయేంత ప్రమాదం ఉండదు అంటూ వైద్య నిపుణులు అంటున్నారు. తాజాగా ఈ వ్యాక్సినేషన్, కేంద్ర ప్రభుత్వంపై ప్రముఖ నటి పూజా బేడీ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. అసలు వ్యాక్సిన్ ఇవ్వడంలో ఉన్న లాజిక్ ఎంటీ అంటూ ఆమె ప్రశ్నించింది.

‘వ్యాక్సిన్ తీసుకున్నా.. తీసుకోకపోయా.. 99 శాతం మంది బతికే అవకాశం ఉన్నప్పుడు.. ముందు ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది ఐసోలేషన్‌ మీద, ఎక్కవ మందికి వ్యాక్సిన్ చేయడం మీద, దీంతో పాట.. ఒకటి లేదా రెండు కంటే రోగాలు ఎక్కువ ఉన్న వాళ్ల రిస్క్‌లో ఉన్నారు అని చెప్పడం మీద. ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్ ఇవ్వమని అడగటం లేదు. కానీ, వ్యాక్సిన్ ఇంకా తీసుకోని వారిపై విపక్ష చూపించవద్దు అని కోరుతున్నాను. ఇది పూర్తిగా లాజిక్ లేనిది.. పెద్ద పాప కార్యం’ అంటూ పూజా బేడీ ట్వీట్ చేసింది. దీనిపై కొంత సానూకల స్పందన వస్తుండగా.. కొందరు విమర్శలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఉద్యోగులకు భారీ బోనస్, బీఎండబ్ల్యూ బైక్స్.. కంపెనీ బంపరాఫర్!

Thu Aug 26 , 2021
కంపెనీలు వారి బెస్ట్ టాలెంట్‌ బయటకు వెళ్లకుండా చూసుకునేందుకు అదిరే ఆఫర్లు అందిస్తున్నాయి. ఒక కంపెనీ అయితే వారి ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించింది. బైక్స్ కూడా ఆఫర్ చేస్తోంది.