కరోనా వల్ల ఉద్యోగం పోయిందా? రూ.10 లక్షల రుణం ఇస్తున్న మోదీ ప్రభుత్వం.. ఇలా అప్లై చేసుకోండి!

ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే చేతిలో డబ్బులు లేవా? ఏం పర్లేదు. మోదీ సర్కార్ అర్హత కలిగిన వారికి సులభంగానే రుణాలు అందిస్తోంది. ఆన్‌లైన్‌లోనే లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.

ప్రధానాంశాలు:లోన్ కావాలా?ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా?మీకు శుభవార్తఉద్యోగం పోయిందా? కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేయాలని భావించే వారికి రూ.10 లక్షల వరకు రుణం అందిస్తోంది. ముద్రా యోజన స్కీమ్ కింద ఈ తరహా రుణాలు పొందొచ్చు.

మీ వద్ద బిజినెస్ చేయడానికి అవసరమైన డబ్బులు లేకపోతే మీరు ప్రధాన్ మంత్రి ముద్రా యోజన కింద లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ముద్రా స్కీమ్ కింద మూడు రకాల రుణాలు పొందొచ్చు. మీ అర్హత, అవసరం ప్రాతిపదికన రుణం తీసుకోవచ్చు.

Also Read: ధరలు పెరుగుతాయనే భయం అక్కర్లేదు.. ఈ గోల్డ్ స్కీమ్‌తో ఈఎంఐలో తక్కువ ధరకే బంగారం కొనండి!

శిశు లోన్ కింద రూ.50 వేల వరకు రుణం పొందొచ్చు. కిశోర్ లోన్ కింద రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. అలాగే తరుణ్ లోన్ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం పొందొచ్చు. మీకు ఎంత డబ్బు అవసరం ఉందో చూసుకొని లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.

ఎలాంటి గ్యారంటీ లేకుండానే లోన్ పొందొచ్చు. తీసుకున్న రుణాన్ని 5 ఏళ్లలోపు తిరిగి చెల్లించాలి. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు అవసరం లేదు. బ్యాంక్ ప్రాతిపదికన రుణాలపై వడ్డీ రేట్లు మారతాయి. 12 శాతం వడ్డీ రేటు ఉండొచ్చు. http://www.mudra.org.in/ వెబ్‌సైట్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఫ్రీ వ్యాక్సినేషన్‌కు సిద్ధమైన 17 రాష్ట్రాలు.. టీకాలపై ఆంక్షల ఎత్తివేతకు కారణం ఇదే

Mon Apr 26 , 2021
Vaccination in India దేశంలో కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. మే 1 నుంచి మూడో దశ ప్రక్రియ ప్రారంభం కానుంది.