బైడెన్‌-మోదీ మధ్య ఫోన్ సంభాషణ.. ఆ విషయంలో అమెరికా కీలక నిర్ణయం

Modi Biden Phone Conversation తమ పౌరుల ఆరోగ్యమే ముఖ్యమని, వారికే తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసిన అగ్రరాజ్యం.. ఈ విషయంలో కాస్త వెనక్కు తగ్గి భారత్‌కు సాయానికి ముందుకొచ్చింది.

ప్రధానాంశాలు:కోవిడ్ పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడితో మోదీ చర్చలు.అన్ని విధాలుగా ఆదుకుంటామని బైడెన్ హామీ.కరోనాపై పోరులో ఇరు దేశాలూ సహాకారం.భారత్‌లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. భారత్‌లో పరిస్థితులు దయనీయంగా మారడంతో సాయానికి పలు దేశాలు ముందుకొస్తున్నాయి. అమెరికా, ఐరోపా సమాఖ్య, ఫ్రాన్స్‌, జర్మనీ తదితర దేశాలు భారత్‌కు అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు. కోవిడ్ టీకా తయారీకి అవసరమైన ముడిపదార్థాలను అందజేయనున్నట్టు అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మధ్య సోమవారం టెలిఫోన్‌ సంభాషణ జరిగింది. ఇరువురి నేతల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ గురించి ప్రధాని మోదీ ట్విట్టర్‌లో వెల్లడించారు.

‘‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చలు ఫలప్రదమయ్యాయి. ఇరు దేశాల్లో కరోనా పరిస్థితి గురించి కూలంకుషంగా చర్చించాం.. క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌కు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన బైడెన్‌కు ధన్యవాదాలు… వ్యాక్సిన్‌ ముడి పదార్థాల సమర్థవంతమైన సరఫరా ప్రాముఖ్యతపై కూడా చర్చించాం.. ప్రపంచానికి సవాల్‌ విసురుతున్న కొవిడ్‌-19 మహమ్మారి సంక్షోభాన్ని భారత్‌-అమెరికా ఆరోగ్య సంరక్షణ భాగస్వామ్యం పరిష్కరించగలదు’’ అని ప్రధాని ట్విటర్‌లో తెలిపారు.

కరోనా చికిత్సకు అవసరమైన వెంటిలేటర్లు, కిట్లు, కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ తయారీకి సంబంధించిన ముడిపదార్థాలను అమెరికా పంపడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. భారత్‌లో రెండో దశ కరోనా ఉద్ధృతికి అడ్డుకట్టవేయడానికి వేగవంతమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం, అత్యవసర ఔషధాలు సరఫరాపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు పీఎంవో పేర్కొంది.

భారత్‌కు సాయంపై అమెరికా అధ్యక్షభవనం వైట్‌‌హౌస్ సైతం ఓ ప్రకటన చేసింది. ‘‘ఇటీవలి కోవిడ్ విజృంభణతో ఇబ్బందులు పడుతున్న భారత ప్రజలకు అమెరికా మద్దతుగా నిలుస్తుందని అధ్యక్షుడు ప్రతిజ్ఞ చేశారు… ఆక్సిజన్ సంబంధిత సామాగ్రి, టీకా ముడిపదార్థాలు, చికిత్సకు అవసరమయ్యే పరికరాలు సహా అత్యవసర సహాయాన్ని అమెరికా అందిస్తుంది’’ అని తెలిపింది. అయితే, తమ వద్ద అదనంగా ఉన్న 30 మిలియన్ల ఆస్ట్రాజెన్‌కా- ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ డోస్‌ల గురించి మాత్రం ప్రస్తావించలేదు.

భారత్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారులు అజిత్‌ దోవల్‌, జేక్‌సులివాన్‌ మధ్య ఆదివారం జరిగిన టెలిఫోన్‌ సంభాషణల తర్వాత అమెరికా ఈ ప్రకటన చేసింది. ‘కొవిడ్‌పై భారత్‌ పోరాటానికి అత్యవసర సాయం అందించేందుకు బైడెన్‌ యంత్రాంగం 24 గంటలూ పనిచేస్తోంది. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు అవసరమైన ముడిపదార్థాలను గుర్తించడం, వాటి తక్షణ లభ్యతపై దృష్టి సారించింది’’ అని వైట్‌హౌస్‌ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

తమతో గడిపితేనే అవకాశాలు అంటున్నారు.. మాట మాట పెరిగి అక్కడ గుద్దాడు.. సినీ నటి ఎమోషనల్ కామెంట్స్

Tue Apr 27 , 2021
మహిళలపై లైంగిక వేధింపుల దుర్ఘటనలు నిత్యం ఎక్కడో చోట కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా యంగ్ హీరోయిన్, ‘దంగల్‌’ ఫేమ్ ఫాతిమా సనా తనకు జరిగిన చేదు అనుభవాన్ని గురించి తెలిపింది.