ఫోన్ పే వాడే వారికి ఝలక్.. ఇకపై అలా చేస్తే..

మీరు ఫోన్ పే వాడుతున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఫోన్ పే వాలెట్‌కు క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు వేసుకోవాలని భావిస్తే.. అదనపు చార్జీలు చెల్లించుకోవాలి. 2 శాతం వరకు చార్జీలు పడుతున్నాయి.

ప్రధానాంశాలు:ఫోన్ పే యూజర్లకు ఝలక్అదనపు చార్జీలుఅలా చేస్తేనే..ఫోన్ పే చాలా మంది వాడుతున్నారు. ఫోన్ పే ద్వారా గ్రాసరీ స్టోర్‌లో చెల్లింపుల నుంచి మనీ ట్రాన్స్‌ఫర్, బిల్లుల చెల్లింపు వరకు పలు రకాల సేవలు పొందొచ్చు. ఇంకా కొంత మంది ఫోన్ పే వాలెట్‌కు క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు లోడ్ చేసుకుంటూ ఉంటారు.

అయితే ఇలాంటి వారికి బ్యాడ్ న్యూస్. ఫోన్ పే వాలెట్‌కు క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు వేసుకుంటే చార్జీలు చెల్లించుకోవాలి. రూ.100కు 2.06 శాతం చార్జీ పడుతుది. అంటే మీరు రూ.200 యాడ్ చేసుకుంటే రూ.4.13 చార్జీ పడుతుంది. రూ.300 అయితే రనూ.6.19 చార్జీ చెల్లించుకోవాలి.

కంపెనీ అడిషనల్ కన్వీనియన్స్ ఫీజు రూపంలో ఈ చార్జీలను వసూలు చేస్తోంది. కేవలం క్రెడిట్ కార్డు లావాదేవీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అదే యూపీఐ, డెబిట్ కార్డు ద్వారా ఫోన్ పే వాలెట్‌కు డబ్బులు యాడ్ చేసుకుంటే ఎలాంటి చార్జీలు పడవని గమనించాలి.

Also Read: పాన్ కార్డు కలిగిన వారికి కేంద్రం అదిరిపోయే శుభవార్త!

Also Read: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన వెండి.. బంగారం ధర మాత్రం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

జగన్ సర్కారుకు కేంద్రం షాక్.. ఆ నిధుల ఖర్చుపై నివేదిక అందజేయాలని లేఖ

Mon Sep 20 , 2021
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు విదేశీ, అంతర్జాతీయ సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి సమగ్ర నివేదికను కోరుతూ కేంద్ర ఆర్ధిక శాఖ లేఖ రాసింది.