ఒక్కరి ద్వారా 406 మందికి కరోనా… ఈ తప్పులు చేస్తే ముప్పు తప్పదు

మాస్కులు, శానిటైజర్లు కరోనా వ్యాప్తి తీవ్రతను మాత్రమే తగ్గిస్తాయని, భౌతిక దూరమే వైరస్ నియంత్రణకు ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రధానాంశాలు:కరోనాపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటననిబంధనలు పాటించకుంటే ఒక్కరి నుంచి 406 మందికి వ్యాప్తి75శాతం పాటిస్తే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని హెచ్చరికదేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలు మాస్క్ ధరించడం, భౌతిక దూరం వంటివి పాటించపోతే దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కోవిడ్ నిబంధనలు సక్రమంగా పాటించకపోతే 30 రోజుల వ్యవధిలో ఒకరి ద్వారా 406 మందికి కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని పరిశోధనలో తేలినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే భౌతిక దూరం, కోవిడ్ నిబంధనలు 50 శాతం పాటించినా ఆ సంఖ్య 406 నుంచి 15కి తగ్గిపోతుందని తెలిపింది. ఒకవేళ 75శాతం నిబంధనలు పాటిస్తే కేవలం ముగ్గురికి మాత్రమే సోకుతుందని స్పష్టం చేసింది.

Also Read: పెళ్లికి 100 మంది అతిథులు.. కటకటాల్లో వరుడు.. కారణం విని షాకైన పోలీసులు

ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకుని కరోనా నియంత్రణకు సహకరించారని కేంద్ర ప్రభుత్వం కోరింది. మాస్కులు, శానిటైజర్లు కరోనా వ్యాప్తి తీవ్రతను మాత్రమే తగ్గిస్తాయని, భౌతిక దూరమే వైరస్ నియంత్రణకు ముఖ్యమని స్పష్టం చేసింది. అందువల్ల అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దని, బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లడం గాని, వాళ్లను ఆహ్వానించడం గాని చేయొద్దని పేర్కొంది. ఆస్పత్రి బెడ్ల విషయంలో ప్రజలెవరూ ఆందోళనకు గురికావొద్దని, కరోనా సోకిన వారు డాక్టర్లు సూచించినప్పుడు మాత్రమే ఆస్పత్రిలో చేరాలని కేంద్రం పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్52 ఫీచర్లు లీక్.. త్వరలోనే లాంచ్.. 64 మెగాపిక్సెల్ కెమెరా!

Mon Apr 26 , 2021
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో గెలాక్సీ ఎఫ్52 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ పలు సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో కనిపించింది. దీని స్పెసిఫికేషన్లు కూడా ఆన్ లైన్‌లో లీకయ్యాయి.