పెళ్లి సందD హంగామా షురూ.. కొత్త తరం కొత్త జంట అంటూ రాఘవేంద్రుడి సర్‌ప్రైజింగ్ వీడియో

రాఘవేంద్ర రావు రూపొందిస్తున్న నయా పెళ్లి సందD హంగామాను ఓ చిన్న శాంపిల్ వీడియోతో షురూ చేశారు. ఈ వీడియోతో రేపు (ఏప్రిల్ 28న) విడుదల కాబోయే మొదటి పాట పట్ల ఆసక్తి రేకెత్తించారు.

ప్రధానాంశాలు:రాఘవేంద్ర రావు నయా పెళ్లి సందD సంగీతం అందిస్తున్న కీరవాణి శాంపిల్ వీడియో రిలీజ్ ఎప్పుడో 25 ఏళ్ళ క్రిందట చేసిన ఆ సందడి మళ్ళీ ఇప్పుడు నవతరం ప్రేక్షకలోకం కోసం నయా 'పెళ్లి సందD'గా రాబోతోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసే సత్తా ఉన్న సంగీత దర్శకుడు కీరవాణి బాణీలు మరోసారి మంత్రముగ్దులను చేయబోతున్నాయి. అయితే అందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన రాఘవేంద్ర రావు తాజాగా ఓ చిన్న శాంపిల్ వదిలి సర్‌ప్రైజ్ చేశారు.

మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కావడంతో ఇక పెళ్లి సందD హంగామా షురూ చేయాలని ఫిక్స్ అయిన రాఘవేంద్ర రావు.. ఏప్రిల్ 28న సినిమాలోని మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ తేదీకి ఉన్న ప్రత్యేకత దృష్ట్యా నయా పెళ్లి సందD హవాను ఆ రోజే స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలో ఆ పాటకు సంబంధించి తాజాగా చిన్న శాంపిల్ వీడియో రిలీజ్ చేశారు. కొత్త తరం కొత్త జంట అని పేర్కొంటూ హీరోహీరోయిన్లను చూపించి రేపు (ఏప్రిల్ 28న) విడుదల కాబోయే పాట పట్ల ఆసక్తి రేకెత్తించారు.
శ్రీ రెడ్డి ఒడిలో పవన్ కళ్యాణ్.. నా బిగ్ చెస్ట్ కారణంగానే ఆయన సేఫ్! బోల్డ్ కామెంట్స్‌తో దుమారం
ఈ సినిమా నాటి ‘పెళ్లి సందడి’కి కొనసాగింపు చిత్రం కాదు. ఇది సరికొత్త కథతో తెరకెక్కుతున్న మూవీ. రొమాంటిక్‌ మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది అని ముందే ప్రకటించిన రాఘవేంద్ర రావు.. త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు. గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా, శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తోంది. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

'బిల్లా' బికినీ డ్రెస్సులపై అనుష్క కామెంట్స్.. అమ్మ అలా అనడంతో షాకయ్యానంటూ స్వీటీ ఓపెన్!!

Tue Apr 27 , 2021
సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ అనుష్క.. కొంత సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. ఇక బిల్లా సినిమాలో బికినీ వేసి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే బిల్లా సినిమాలో తన డ్రెస్సింగ్ చూసి తన తల్లి ఇచ్చిన రియాక్షన్‌ ఏంటో అనుష్క ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.