అనారోగ్యంగానే పవన్ కళ్యాణ్.. కరోనా నుంచి కోలుకున్నా అప్పటి వరకూ..

ఇటీవల ‘వకీల్‌సాబ్’ సినిమాతో తెలుగు వెండితెరపై రీఎంట్రీ ఇచ్చారు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్. అయితే ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఆయన కరోనా బారిన పడ్డారు. కొన్ని రోజులు ఐసోలేషన్‌లో చికిత్స తీసుకున్న తర్వాత పవన్‌ వైరస్ నుంచి కోలుకున్నారు. కానీ, ఆయన ఇంకా అనారోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు.

రెండో దశలో కరోనా వైరస్ ప్రభావం సినీ పరిశ్రమపై గట్టిగా ఉంది. పలువురు సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడి కోలుకోగా.. కొందరు ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా షూటింగ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక తమ వ్యక్తిగత సిబ్బందిలో కొందరు వైరస్ బారిన పడటంతో స్టార్లు ముందు జాగ్రత్త చర్యగా తమని తాము ఐసోలేట్ చేసుకుంటున్నారు. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ కూడా కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. తన వ్యక్తిగత సిబ్బందికి కరోనా రావడంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు.

అయితే ఆ తర్వాత పరీక్షలు నిర్వహించగా.. ఆయనకి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన తన ఫామ్ హౌస్‌లో ఉంటూనే చికిత్స తీసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత ఆయనకు మళ్లీ పరీక్షలు నిర్వహించగా.. ఫలితం నెగటివ్‌ అని వచ్చింది. అయితే కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. పవన్ ఇంకా అనారోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆయన తన ఫామ్ హౌస్‌లోనే ఉండాలని.. బయటకు వెళ్లవద్దని వైద్యులు సూచించారు. మళ్లీ ఆయన ఆరోగ్యం మునుపటిలా మారడానికి మరో రెండు వారాల సమయం అయినా పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

మూడు సంవత్సరాల విరామం తర్వాత పవన్‌కళ్యాణ్ ‘వకీల్‌సాబ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత పవన్.. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీర మల్లు’, అయ్యప్పనుమ్ కోశియమ్ సినిమా రీమేక్‌లలో నటిస్తున్నారు. ఈ రీమేక్ సినిమాలో పవన్‌తో పాటు రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నాడు. కరోనా పరిస్థితులు మెరుగైన తర్వాత పవన్ మళ్లీ ఈ సినిమాల షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఆ సినిమా వచ్చి అప్పుడే 20 ఏళ్లయిందా.? సిద్ధూ- మధు అంటే ఇప్పటికీ..: హీరోయిన్ భూమిక

Tue Apr 27 , 2021
ఎస్‌జే సూర్య డైరెక్షన్‌లో పవన్‌కళ్యాణ్, భూమిక హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఖుషి’ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక క్లాసిక్ చిత్రం. ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ సినిమాలో ‘మధు’ పాత్రలో నటించిన భూమిక తన రియాక్షన్‌ను తెలిపింది.