యువత నమ్మి ఓటేస్తే ఇంత మోసమా?.. వదిలిపెట్టం: పవన్‌కళ్యాణ్

ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో యువత నమ్మి ఓటేస్తే జగన్ వారిని దారుణంగా మోసం చేశారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అన్ని ఖాళీలు చేర్చి కొత్తగా జాబ్ క్యాలెంటర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రధానాంశాలు:నిరుద్యోగులకు అండగా జనసేన20న ఉపాధి కల్పన కార్యాలయాల్లో వినతిపత్రాలుపవన్‌ కళ్యాణ్‌ వెల్లడిరాష్ట్రంలోని నిరుద్యోగులకు జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అన్నారు. ఉద్యోగ క్యాలెండరు ద్వారా 10 వేల పోస్టులను మాత్రమే ప్రకటించడం యువతను వంచించడమేనని అభిప్రాయపడ్డారు. ఈ నెల 20న అన్ని జిల్లాల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు.. నిరుద్యోగ యువతతో కలిసి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయా(ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్ఛేంజీ)ల్లో వినతిపత్రాలు అందిస్తారని వెల్లడించారు. ఉద్యోగ క్యాలెండరుపై ప్రభుత్వం పునఃసమీక్షించి వివిధ శాఖల్లోని అన్ని ఖాళీలను చేర్చి కొత్త క్యాలెండరు విడుదల చేస్తే యువతకు న్యాయం జరుగుతుందని సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

‘సీఎం జగన్‌ చెప్పిన మెగా డీఎస్సీ ఏమైపోయింది? కొద్ది నెలల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగాల భర్తీపై సమీక్షించి గ్రూప్‌-1, గ్రూప్‌-2 విభాగాల్లో వెయ్యి ఖాళీలు గుర్తించినా.. జాబ్‌ క్యాలెండరులో మాత్రం 36 ఖాళీలే పేర్కొనడమేంటి?’ అని పవన్‌ ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చే వాతావరణం లేదు. ఇప్పటికే ఉన్నవాటి విస్తరణ ముందుకు సాగడం లేదు. ఫలితంగా యువత ప్రైవేటులోనూ ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో వైసీపీ చెప్పిన మాటల్ని యువత నమ్మారు. తీరా ఉద్యోగ క్యాలెండరు విడుదల చేశాక మోసపోయామని నిర్ధారణకు వచ్చింది.’

‘సుమారు 30 లక్షల మంది ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరి ద్వారా పోటీ పరీక్షల ఫీజుల రూపంలోనే ప్రభుత్వానికి రూ.కోట్ల ఆదాయం వస్తోంది. తమ ఆశలను ప్రభుత్వం ఇలా సొమ్ము చేసుకుంటోందని నిరుద్యోగుల ఆవేదనతో ఉన్నారు’ అని పవన్‌ స్పష్టం చేశారు. ప్రస్తుత ఉద్యోగ క్యాలెండర్ వెనక్కి తీసుకుని అన్ని ఖాళీలతో మళ్లీ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అలా చేస్తే రాజీనామాలకు మేం సిద్ధం... వైసీపీకి టీడీపీ ఎంపీల సవాల్

Sat Jul 17 , 2021
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో వైఎస్సార్సీపీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు సవాల్ విసిరారు. ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునే ఉద్యమానికి వైసీపీ సారథ్యం వహిస్తే తాము రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.