Pawan Kalyan గురించి ఇలా ఎవ్వరూ మాట్లాడి ఉండరు!.. పరుచూరి కామెంట్స్ వైరల్

పరుచూరి గోపాల కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకుల నాడిని తెలుసుకుని మాటలు, కథలు, కథనాలు అందించడంలో దిట్ట. ఇక నటనలోనూ పరుచూరి గోపాల కృష్ణ మేటి.

ప్రధానాంశాలు:పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్పవర్ స్టార్‌పై పరుచూరి గోపాల కృష్ణరాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్పరుచూరి గోపాల కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకుల నాడిని తెలుసుకుని మాటలు, కథలు, కథనాలు అందించడంలో దిట్ట. ఇక నటనలోనూ పరుచూరి గోపాల కృష్ణ మేటి. ఆయన తన అనుభవాన్ని రంగరించి.. ఈ తరం సినీ ప్రేమికులకు పరుచూరి పలుకులు అంటూ సినీ పాఠాలను చెబుతున్నారు. యూట్యూబ్‌లో ఆయన చెప్పే పాఠాలకు ఎంతో మంది అభిమానులున్నారు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ గురించి, భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ గురించి, ఆయన సినీ రాజకీయ జీవితం గురించి మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ సినీ, రాజకీయ రంగాల్లో రాణించాలని చెబుతూ పరుచూరి గోపాలకృష్ణ కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘గత ఏడాది నేను ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబితే.. మళ్లీ ఆయన నాకు థ్యాంక్స్ అంటూ ట్వీట్ పెట్టారు. అంతటి సంస్కారవంతులు. పైకి కనిపించడు కానీ.. ఆయన లోపల తాత్విక చింతన ఉంటుంది. పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఇలా ఇద్దరిలోనూ ప్రపంచానికి తెలియని వేరే వ్యక్తులు వారి లోపల ఉన్నారు. తాత్వికచింతన ఉన్న వారు.. రెండు రకాలుగా ఉంటారు. ప్రపంచానికి దూరంగా ఐహిక సుఖాలకు దూరంగా ఉండే వారు ఒకరకం. ప్రపంచంలోకి వచ్చి.. ప్రశ్నించి.. ఏ ప్రపంచంలో నాకు ఓ జన్మ వచ్చిందో.. ఆ జన్మ ద్వారా ఎంతో మంది కష్టాలను, కన్నీళ్లను తుడవాలి అన్న ఆలోచనతో ఉండేవారు ఇంకోరకం. అలాంటివారే పవన్ కళ్యాణ్.

అలాంటి వారు రాజకీయాల్లోకి వచ్చారు. రావాలి కూడా. ప్రపంచాన్ని పాడు చేసేది మేధావులే. మేధావులు మౌనంగా ఉండటం వల్లే నాశనం అవుతుంది. మేధావులు ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడే అందరూ మారుతారు. జనాలు కూడా ఆలోచిస్తారు. అంత మంచి పవన్ కళ్యాణ్ తాను కోరుకున్న రాజకీయ జీవితాన్ని కూడా అనుభవించాలి.

ఆయన ఈ రోజు కోరుకుంటే ఏం అవ్వగలడో అందరికీ తెలిసిందే. తన మనసులోని మాట ఒక్కటి బయటపెడితే.. రాజ్యసభలో ఉంటారు. కానీ ఆయన అలా కోరుకోలేదు. మీ ద్వారా వెళ్లాలని అనుకుంటున్నారు. అందుకే వచ్చే 2024లో ఆయన కల నెరవేరాలని, ప్రజా ప్రతినిధిగా ఎదగాలని, అద్బుతమైన సేవ చేయాలని అలా సేవ చేస్తూనే.. ఎంజీఆర్‌లా ఈ నటన కూడా కొనసాగించాలని, ఆ కళామతల్లి ఎన్నాళ్లు ఆశీర్వదిస్తూ అన్నాళ్లు నటించాలని కోరుకుంటున్నాను’ అని చెబుతూ పవన్ కళ్యాణ్‌కు పరుచూరి గోపాలకృష్ణ అడ్వాన్స్ బర్త్ డే విషెస్ చెప్పారు. ఆయనతో ఒక్క సినిమాకు పని చేయకపోయినా కూడా ఎందుకో తెలియని ఇష్టం అదంతే అంటూ పవన్ మీదున్న ప్రేమను పరుచూరి చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు అయినా సరే చెబుతాను.. వంద సార్లు చెప్పినా తక్కువే అవుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

చాలా నొప్పి, వాచిపోయిందట!.. ఆరోగ్య సమస్యలతో సతమతమైన షణ్ముఖ్ జశ్వంత్

Sun Aug 29 , 2021
షణ్ముఖ్ జశ్ంత్‌కు సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. యూట్యూబ్‌లో స్టార్‌గా మారిపోయారు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేస్తున్నారు. గత ఏడాది సాఫ్ట్ వేర్ డెవలవ్‌పర్ అంటూ అందరినీ కట్టిపడేశారు.