పారా ఒలింపిక్స్.. స్వర్ణంతో చరిత్ర సృష్టించిన భారత షూటర్ అవని

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం ఫైనల్లో ఇండియన్ షూటర్ అవనీ లేఖరా అద్భుతమైన గురితో భారత్‌కు పసిడి పతకాన్ని సాధించిపెట్టింది. ఈ ఫైనల్‌లో అవనీ లేఖరా… 249.6 పాయింట్లతో గోల్డ్ మెడల్ సాధించారు.

ప్రధానాంశాలు:పారా ఒలింపిక్స్‌లో స్వర్ణంషూటింగ్‌లో స్వర్ణం కైవసంఅవనీ లేఖరా సరికొత్త చరిత్రభారత షూటర్ అవనీ లేఖరా చరిత్ర సృష్టించింది. పారా ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు క్రియేట్ చేసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం ఫైనల్లో ఇండియన్ షూటర్ అవనీ లేఖరా అద్భుతమైన గురితో భారత్‌కు పసిడి పతకాన్ని సాధించిపెట్టింది. ఈ ఫైనల్‌లో అవనీ లేఖరా… 249.6 పాయింట్లతో గోల్డ్ మెడల్ సాధించగా… చైనాకు చెందిన కుయ్‌పింగ్ ఝాంగ్ 248.9 పాయింట్లతో రజత పతకాన్ని.. ఉక్రెయిన్‌కి చెందిన ఇర్యానా షెత్నిక్ 227.5 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

అవనీ లేఖరా ఫైనల్‌ను అద్భుతంగా ప్రారంభించింది. నిలకడగా పది పాయింట్లకుపై గా సాధించిన అవనీ.. ఫస్ట్ కాంపిటీషన్లో రెండు షాట్లు మాత్రమే పది కంటే తక్కువగా సాధించింది. దీంతో ఆమె రెండో స్థానంలో నిలిచింది. ఎలిమినేషన్ రౌండ్లో తొలి స్థానంలో నిలిచిన భారత షూటర్.. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించింది. 249.6 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి పసిడిని సొంతం చేసుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్లో ఏడో స్థానంలో నిలిచిన ఆమె.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. స్వర్ణం సాధించిన అవనిపై ప్రధాని మోదీ ప్రశంసలు గుప్పించారు.

19 ఏళ్ల అవని సాధించిన స్వర్ణంతో.. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఐదుకు చేరింది. టేబుల్ టెన్నిస్‌లో భవీనాబెన్ పటేల్ రజతం సాధించి భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. హై జంప్‌లో నిషద్ కుమార్ రజతాన్ని సాధించగా.. డిస్కస్ త్రోలో వినోద్ కుమార్ కాంస్య పతకాన్ని సాధించాడు. డిస్కస్ త్రోయర్ యోగేష్ కథునియా రజత పతకాన్ని సాధించాడు.

ఆగస్టు 24న ప్రారంభమైన టోక్యో పారాలింపిక్స్.. సెప్టెంబర్ 5న ముగియనున్నాయి. ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఓ పసిడి సహా ఏడు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌పై ధర తగ్గింపు.. ఎంత తగ్గింది? ఏ ఫోన్?

Thu Sep 2 , 2021
ఇన్‌ఫీనిక్స్ హాట్ 10ఎస్ స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ రూ.500 తగ్గింపును అందించింది. దీంతో ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.9,499 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.