పారాలింపిక్స్‌లో భారత్‌కి ఐదో గోల్డ్ మెడల్.. 19కి చేరిన పతకాల సంఖ్య

పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల వేట చివరి రోజు కూడా కొనసాగింది. బ్యాడ్మింటన్‌లో శనివారం ప్రమోద్ భగత్ స్వర్ణం గెలవగా.. ఆదివారం షట్లర్ కృష్ణ నగర్ కూడా స్వర్ణం గెలిచాడు.

ప్రధానాంశాలు:భారత్‌కి పారాలింపిక్స్‌లో ఐదో గోల్డ్ మెడల్ఫైనల్లో హాంకాంగ్ షట్లర్‌ని ఓడించిన కృష్ణ నగర్19కి చేరిన భారత పతకాల సంఖ్య పారాలింపిక్స్‌‌లో ఈరోజే ఆఖరి టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కి ఐదో పసిడి పతకం దక్కింది. ఫురుషుల సింగిల్స్ ఎస్‌హెచ్ 6 బ్యాడ్మింటన్ ఫైనల్లో గెలిచిన కృష్ణ నగర్.. బంగారు పతకాన్ని గెలుపొందాడు. హాంకాంగ్‌కి చెందిన మ్యాన్ కై చు‌తో ఈరోజు ఫైనల్లో తలపడిన కృష్ణ నగర్ 21-17, 16-21, 21-17 తేడాతో విజయం సాధించాడు. దాంతో.. భారత్ పతకాల సంఖ్య కూడా 19కి చేరింది.

ఈరోజు ఫైనల్లో కృష్ణ నగర్‌కి ఆరంభం నుంచి గట్టి పోటీ ఎదురైంది. తొలి సెట్‌ ఆరంభంలోనే ఇద్దరూ పోటాపోటీగా పాయింట్లు సాధించడంతో 5-5తో మ్యాచ్ ఆసక్తికరంగా కనిపించింది. కానీ.. 11-10తో ఆధిక్యంలో వెళ్లిన కృష్ణ నగర్‌ ఆ తర్వాత ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా 21-17తో సెట్‌ని చేజిక్కించుకున్నాడు.

సెకండ్ సెట్‌లో మాత్రం కృష్ణ నగర్‌కి 16-21‌తో ఎదురుదెబ్బలు తప్పలేదు. కానీ.. మూడో సెట్‌లో మళ్లీ పుంజుకున్న కృష్ణ నగర్‌ ఆరంభంలోనే 5-1‌తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత చూస్తుండగానే 11-7కి వెళ్లినా మధ్యలో తడబడటంతో 15-14తో ప్రత్యర్థి పుంజుకున్నాడు. అయితే.. చివర్లో తప్పిదాలు దిద్దుకున్న కృష్ణ నగర్‌ 21-17తో మూడో సెట్‌ని చేజిక్కించుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ముగిసిన పారాలింపిక్స్.. భారత్‌ ఎన్ని పతకాలు గెలిచిందంటే..?

Sun Sep 5 , 2021
పారాలింపిక్స్ ఆదివారంతో ముగిశాయి. అంచనాలకి మించి రాణించిన భారత అథ్లెట్లు ఏకంగా 19 పతకాలు గెలుపొందగా.. ఇందులో ఐదు గోల్డ్ మెడల్స్ ఉండటం విశేషం. భారత పతాకధారిగా అవని లేఖరా వ్యవహరించింది.