సామాన్యులకు షాక్.. భారీగా పెరగనున్న వీటి ధరలు!

మీరు కొత్తగా టీవీ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకో షాక్. రానున్న కాలంలో టీవీల ధరలు పెరగొచ్చని నివేదికలు వెలువడుతున్నాయి. దీంతో టీవీ కొనాలనుకునే సామాన్యులపై ప్రభావం పడనుంది.

ప్రధానాంశాలు:సామాన్యులకు ఝలక్పెరగనున్న వీటి ధరలుకారణం ఇదేఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డ్ స్థాయి పెరుగుదలతో పైపైకి దూసుకెళ్తున్నాయి. వంట నూనె ధరలు కూడా కొండెక్కాయి. దీంతో ఇప్పటికే ప్రజలపై చాలా ప్రభావం పడుతోంది. ఇప్పుడు సామాన్యులకు మరో షాక్ తగలనుంది. కంపెనీలు ఝలక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి.

పానాసోనిక్, హయర్, థామ్సన్ వంటి కంపెనీలు వీటి టీవీల ధరలను పెంచేందుకు సన్నద్ధమౌతున్నాయి. దీంతో కొత్తగా టీవీకొనుగోలు చేయాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల కంపెనీలు కూడా ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నాయి.

Also Read: పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్.. రూ.150 పొదుపుతో చేతికి రూ.24 లక్షలు!

పానాసోనిక్, థామ్సన్, హయర్ టీవీల ధరలు 3 శాతం నుంచి 4 శాతం వరకు పైకి చేరొచ్చు. టీవీ కంపెనీలు గతంలో కూడా టీవీల ధరలను రూ.6 వేల వరకు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీవీల ధరలు రూ.2 వేల వరకు పెరగొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.

పానాసోనిక్ ఇండియా సీఈవో మనీశ్ శర్మ మాట్లాడుతూ.. ఎల్‌ఈడీ టీవీల్లో ఉపయోగించే పానెల్స్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిందని, అందువల్ల దేశీ మార్కె్ట్‌లో కంపెనీలు టీవీల ధరను పెంచనున్నాయని వివరించారు. దీంతో కొత్తగా టీవీ కొనే వారిపై ప్రభావం పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

తెలంగాణలో స్కూళ్లు, కాలేజీల రీఓపెన్.. డేట్ ఫిక్స్, కేబినెట్ సంచలన నిర్ణయం

Sat Jun 19 , 2021
Telangana Schools: జులై 1 నుంచి అన్ని రకాల విద్యాసంస్థలను ప్రారంభించాలని విద్యాశాఖ అధికారుల‌ను మంత్రివర్గం ఆదేశించింది. పూర్తిస్థాయి సన్నద్థతతో విద్యాసంస్థలను పున:ప్రారంభించాలని స్ఫష్టం చేసింది.